Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడు వన్డే ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు

Opening Ceremony For ICC World Cup 2019 Set To Be The Biggest Ever!!
ICC Cricket World Cup 2019: ICCs Chief Executive wants to make this World Cup a greatest celebration of cricket ever

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు బుధవారం జరుగనున్నాయి. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు లండన్‌లోని మాల్‌ రోడ్‌లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఐసీసీ-ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 12వ క్రికెట్‌ ప్రపంచకప్‌ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రత్యక్షంగా నాలుగు వేల మంది:

ప్రత్యక్షంగా నాలుగు వేల మంది:

క్రికెట్, సంగీతం కలబోతగా ఈ ప్రోగ్రామ్‌ జరగనుంది. సుమారు గంటసేపు కార్యక్రమం జరుగుతుందని సమాచారం. అయితే ఇందులో ఎటువంటి ప్రదర్శనలు ఉంటాయో మాత్రం తెలియరాలేదు. ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా నాలుగు వేల మంది వీక్షించనున్నారు. వీరందరికి బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్లెవరూ ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. అయితే మాజీ ఆటగాళ్లు, మరికొందరు ప్రత్యేక అతిథులు పాల్గొంటారు. ఈ వేడుకలు పలు చానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్నాయి.

ఆసీస్ మాత్రమే:

ఆసీస్ మాత్రమే:

మంగళవారంతో ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ముగిసాయి. టోర్నీలో పాల్గొననున్న 10 జట్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాయి. ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆసీస్ మాత్రమే విజయాలు సాధించింది. భారత్ ఒక మ్యాచ్ ఓడగా.. మరో మ్యాచ్‌లో గెలుపొందింది. కొన్ని మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో గురువారం ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.

రౌండ్ రాబిన్ పద్దతిలో:

రౌండ్ రాబిన్ పద్దతిలో:

మ్యాచులు రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్నాయి. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఈ రౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. అనంతరం పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో రెండు జట్లు (1 vs 4, 2 vs 3) ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

జూన్ 16న హై ఓల్టేజ్ మ్యాచ్‌:

జూన్ 16న హై ఓల్టేజ్ మ్యాచ్‌:

డే మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది.

Story first published: Wednesday, May 29, 2019, 9:28 [IST]
Other articles published on May 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+