For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి చాలా అవకాశాలున్నాయి.. భారత బౌలింగ్‌పై చాపెల్‌ ప్రశంసలు

ICC Cricket World Cup 2019: Ian Chappell praises Indias bowling unit & Virat Kohli has plenty of options

భారత క్రికెట్‌ జట్టుపై ఆసీస్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్‌ చాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా భారత బౌలింగ్‌ను అతను కొనియాడాడు. బౌలింగ్‌ వనరులను ఉపయోగించుకునేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా అవకాశాలు ఉన్నాయని చాపెల్ అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇయాన్‌ చాపెల్‌ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... 'క్రికెట్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. గత కొంత కాలంగా వన్డేలలో భారీ స్కోర్లను తరచు చూస్తున్నాం. ఈ ప్రపంచకప్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి బౌలింగ్‌ ఎటాకింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లతో పోలిస్తే.. భారత్‌ బౌలింగ్ విభాగం కాస్త వెనుకంజలో ఉంది' అని చాపెల్‌ పేర్కొన్నారు.

'భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్‌, షమీలు ప్రభావం చూపుతారు. ఇక పిచ్‌లు పొడిబారిన సమయంలో కుల్దీప్‌, చహల్‌లు ప్రమాదకరంగా మారతారు. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఉన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు సాధించే సత్తా భారత్‌కు ఉంది. మధ్య ఓవర్లలో భారత్‌ బౌలింగ్‌ అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ప్రపంచకప్‌ సాధించడానికి దోహద పడుతుంది. భారత్‌కు బౌలింగ్‌ విభాగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ చక్కగా వినియోగించుకోవాలని' చాపెల్‌ సూచించాడు.

Story first published: Monday, May 27, 2019, 15:39 [IST]
Other articles published on May 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+