For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతను అప్పటికీ ఉంటే.. నేను కూడా 2023 వరల్డ్‌కప్‌ ఆడతా'

ICC Cricket World Cup 2019: Ill come back in 2023 World Cup if MS Dhoni is still playing says AB de Villiers

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ 2023 వరల్డ్‌కప్‌ వరకు తన ఆటను ఇలాగే కొనసాగిస్తే.. తాను కూడా ఆ వరల్డ్‌కప్‌లో ఆడుతానని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నారు. 2018 మే నెలలో డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పనుకున్నాడు. అయితే ఐపీఎల్‌ వంటి విదేశీ లీగ్‌ల్లో ఏబీ ఆడుతూ.. అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌-12లో కూడా బెంగళూరు తరపున ఆడుతూ పరుగులు చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ధోనీ ఆడితే.. నేను ఆడతా:

ధోనీ ఆడితే.. నేను ఆడతా:

తాజాగా గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన 'బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షో'లో డివిలియర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్‌ అడిగిన ప్రశ్నలకు 'మిస్టర్ 360' సమాధానాలు ఇచ్చాడు. 2023లో జరిగే ప్రపంచకప్‌లో తిరిగి ఆడుతారా? అని గౌరవ్‌ ప్రశ్నించగా.. 'అప్పటికి నాకు 39 ఏళ్లు వస్తాయి. ధోనీ 2023 వరల్డ్‌కప్‌ వరకు తన ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కచ్చితంగా నేను కూడా ఆడతాను' అని డివిలియర్స్ సమాధానం ఇచ్చాడు.

2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలకున్నా:

మంచి ఫామ్ ఉన్నపుడే రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించారాని అడగ్గా... 'అది కఠిన నిర్ణయం. అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. 2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలని అనుకున్నా.. కానీ పరిస్థితులు అనుకూలించ లేదు. చాలా ఆలోచించే చివరకు ఆ నిర్ణయం తీసుకున్నా' అని ఏబీ తెలిపారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం 'యూ ట్యూబ్'లో వైరల్ అవుతోంది. 'ధోనికి 80 ఏళ్లు వచ్చినా తన ఆల్ టైం డ్రీం ఎలెవన్‌లో స్థానం కల్పిస్తానని, వీల్‌చైర్లో ఉన్నా తన జట్టు తరఫున ధోనీ బరిలో దిగుతాడని' ఏబీ గతంలో అన్నాడు.

డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు:

డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు:

2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది.

Story first published: Saturday, May 18, 2019, 17:58 [IST]
Other articles published on May 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+