Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గేల్‌ను చూసి స్ఫూర్తి పొందా.. 2023 ప్రపంచకప్‌ ఆడుతా'

ICC Cricket World Cup 2019: I Inspired by Chris Gayle says Ross Taylor, And Wants to Play World Cup 2023

వెస్టిండీస్‌ స్టార్‌ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ను చూసి స్ఫూర్తి పొందా. శరీరం సహకరిస్తే 2023 ప్రపంచకప్‌ ఆడుతా అని న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ (35) తెలిపారు. గత కొంత కాలంగా రాస్‌ టేలర్‌ న్యూజిలాండ్‌ తరపున స్థిరంగా రాణిస్తున్నాడు. జట్టుకు అవసరమయినప్పుడు భారీ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. అలవోకగా బౌండరీలు, సిక్సులు కొట్టగల సత్తా ఉంది. తన మార్క్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పగలడు. ఈ సానుకూలతోనే అతను ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గేల్‌ నాకు స్ఫూర్తి:

గేల్‌ నాకు స్ఫూర్తి:

తాజాగా రాస్‌ టేలర్‌ మాట్లాడుతూ... 'ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్‌ వరకు నాకు 39 ఏళ్లు వస్తాయి. క్రిస్‌ గేల్‌ వయసు 39. నాకు అతనే స్ఫూర్తి. అతన్ని చూసే నేను ఇంకా క్రికె‌ట్‌లో​ కొనసాగాలనే అనుకుంటున్నా. ఇదే నా చివరి ప్రపంచకప్‌ అని చెప్పలేను. అయితే నా శరీరం అనుకూలిస్తే తప్పకుండా అప్పటివరకు క్రికెట్‌లో కొనసాగుతా' అని టేలర్‌ తెలిపారు.

 నా కోరిక అదే:

నా కోరిక అదే:

'న్యూజిలాండ్‌ జట్టు ప్రపంచకప్‌ సాధించాలనేది నా కోరిక. అది ఈ సారి నెరవేరుతుందని అనుకుంటున్నా. ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా నా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. అయితే దీన్ని మనసులో పెట్టుకుని ఆటకు సిద్ధం కాను. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి సహజం. దాన్ని అధిగమిస్తేనే విజయాల్ని సాధించగలం. మ్యాచ్‌లకు మధ్య ఉన్న సమయంను ఉపయోగించుకోవాలి' అని టేలర్‌ అన్నారు.

వార్మప్‌ మ్యాచ్‌లో 71 పరుగులు:

వార్మప్‌ మ్యాచ్‌లో 71 పరుగులు:

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టేలర్‌ 71 పరుగులు చేసి కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్తో కలిసి మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. మంగళవారం వెస్టిండీస్ జట్టుతో కివీస్ రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. జూన్ 1న శ్రీలంకతో కివీస్ అసలు సమరంలో పోటీపడనుంది.

న్యూజిలాండ్ జట్టు:

న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాతమ్ (వికెట్ కీపర్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, లూకీ ఫర్గూసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్, కొలిన్ మున్రో, ఇస్ సోధి, హెన్రీ నికోల్స్, మార్టిన్ గప్తిల్, మాట్ హెన్రీ, జిమ్మీ నీషం.

Story first published: Monday, May 27, 2019, 16:27 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+