For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రస్తుతం బాగానే ఉన్నా.. త్వరలోనే డిశ్చార్జి అవుతా: లారా

ICC Cricket World Cup 2019 : Brian Lara Says 'I am Fine, Recovering And I Will Be Back Tomorrow'
ICC Cricket World Cup 2019: I am fine, will be in my hotel room tomorrow says Brian Lara

వెస్టిండిస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా (50) ఛాతి నొప్పి నుండి ప్రస్తుతం కోలుకున్నాడు. ఈ రోజు ముంబయిలోని గ్లోబల్‌ ఆస్పత్రి నుండి డిశ్చార్జి అవ్వనున్నారు. ఈ విషయాన్ని లారా స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం లారా ఆరోగ్యం నిలకడగానే ఉందని గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు కూడా తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా విండీస్ క్రికెట్ బోర్డు లారా మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో లారా మాట్లాడుతూ... ' నాకు ఏమైందని ప్రతిఒక్కరూ చాలా ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం జిమ్ లో ఎక్కువ సమయం గడిపా. ఛాతి నొప్పి వచ్చింది. వైద్యులకు చూపించాలనుకున్నా. అక్కడ చాలా టెస్టులు చేసారు. ప్రస్తుతం బాగానే ఉన్నా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ చూస్తున్నాను. త్వరలో డిశ్చార్జి అవుతా' అని లారా తెలిపారు.

ప్రపంచకప్‌ విశ్లేషకుడిగా స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ కోసం భారత్‌ నుంచి లారా పని చేస్తున్నాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ముంబైలోని స్టార్‌స్పోర్ట్స్‌ స్టూడియోలో డగౌట్‌ ప్యానెల్‌లో నిపుణుడిగా ఉన్న లారా కొద్దిరోజులుగా భారత్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. ప్రస్తుతం లారా ఆరోగ్యం నిలకడగానే ఉంది.

లారా అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే స్టార్ స్పోర్ట్స్‌ అధికారులు గ్లోబల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల కిందట అతడికి స్టెంట్‌ వేశారు. ఇక గురువారం విండీస్‌-భారత్‌ మ్యాచ్‌కు కామెంటరీ చేయనున్నాడని సమాచారం తెలుస్తోంది.

Story first published: Wednesday, June 26, 2019, 9:22 [IST]
Other articles published on Jun 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+