'తెరపై ఫాస్ట్ బౌలర్ అని వేయడం లేదు.. చిరాగ్గా ఉంది'

మైదానంలో బౌలింగ్‌కు దిగగానే భారీ తెరపై మీడియం పేసర్ అని వేస్తున్నారు. ఇది చూసినపుడు చాలా చిరాగ్గా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ అని వేయడం లేదు అని వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ అండ్రీ రసెల్ ఆవేదన వ్యక్తం చేసాడు. శుక్రవారం ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రసెల్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

చాలా మంది మరిచిపోతున్నారు:
రసెల్ మాట్లాడుతూ... 'చాలా మంది నేను భారీ షాట్లు కొట్టే హిట్టర్‌ననే అనుకుంటున్నారు. నన్ను అదే విధంగా చూస్తున్నారు. నేనో ఫాస్ట్ బౌలరన్న విషయాన్ని గుర్తుంచుకోవడం లేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ కూడా వేస్తాను. అయినా ఫాస్ట్ బౌలర్ అన్న విషయాన్ని చాలా మంది మరిచిపోతున్నారని' ఆవేదన వ్యక్తం చేసాడు.

ఫాస్ట్ బౌలర్ అని వేయడం లేదు:
'బౌలింగ్ విషయంలో నన్ను అందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మైదానంలో బౌలింగ్‌కు దిగగానే భారీ తెరపై మీడియం పేసర్ అని వేస్తున్నారు. ఇది చూసినపుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. తెరపై ఫాస్ట్ బౌలర్ అని వేయడం లేదు. గంటకు 90 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తా. కొంచెం అయినా గౌరవమివ్వాలి కదా' అని రసెల్ పేర్కొన్నాడు.

బౌలింగ్ చేయడానికి సిద్ధం
'గత కొంత కాలంగా మోకాలి గాయంతో క్రికెట్ ఆడుతున్నాను. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కొంచెం ఇబ్బంది పెట్టింది. తర్వాతి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉంది. కోలుకోవడానికి ఇది చాలు. మాకు మంచి ఫిజియో, మసాజ్ టీం ఉంది. మరో రెండు రోజులు వారు నాపై ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారు. 80 శాతం ఫిట్ నెస్ ఉన్నా బౌలింగ్ చేయడానికి సిద్ధం. వచ్చే మ్యాచ్ ఆడుతా' అని రసెల్ ధీమా వ్యక్తం చేసాడు. ఈ మ్యాచ్‌లో రసెల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం గాయం కారణంగా బౌలింగ్ వేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications