ఇంగ్లాండ్‌తో ఆరంభ మ్యాచ్: కోహ్లీ రికార్డుని ఆమ్లా బద్దలు కొట్టేనా?

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ రికార్డుకి చేరువలో ఆమ్లా
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డుకి దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

8వేల పరుగుల మైలరాయిని
విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు సాధించాడు. దీంతో పాటు వన్డేల్లో రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల పరుగులను ఆమ్లానే అత్యంత వేగంగా అందుకున్న రికార్డుని సొంతం చేసుకున్నాడు.

నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత
దీంతో పాటు దక్షిణాఫ్రికా తరఫున 8000 పరుగులు అందుకున్న నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. అంతకుముందు జాక్వస్ కలీస్(11550), ఏబీ డివిలియర్స్ (9427), హార్ష్‌లే గిబ్స్(8094)లు ఈ జాబితాలో ఆమ్లా కన్నా ముందు వరుసలో ఉన్నారు. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌పై వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో సఫారీ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు.

గత కొంతకాలంగా ఆమ్లా పేలవ ప్రదర్శన
ఈ జాబితాలో జాక్వస్ కల్లిస్(1054) ఆమ్లా కంటే ముందున్నాడు. కాగా, గత కొంతకాలంగా ఆమ్లా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమ్లాకి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. 36 ఏళ్ల ఆమ్లాకి ఇదే ఆఖరి వరల్డ్‌కప్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications