న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ సక్సెస్... నెక్ట్స్ వరల్డ్‌కప్: స్పష్టం చేసిన హార్దిక్ పాండ్యా

ICC Cricket World Cup 2019 : Pandya Eyes Glory With India In Showpiece Tournament After IPL Win !
ICC Cricket World Cup 2019: Hardik Pandya eyes glory with India in showpiece tournament after IPL success

హైదరాబాద్: ఐపీఎల్ ముగిసింది... ఇక తన దృష్టంతా వరల్డ్‌కప్‌పైనే అని చెప్పుకొచ్చాడు టీమిండియా అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ 12వ సీజన్‌లో 91 స్ట్రయిక్ రేట్‌లో 402 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా 14 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పైనల్ మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ "ఐపీఎల్ ముగిసింది, ఇక వరల్డ్‌కప్‌పై దృష్టి కేంద్రీకరిస్తా. వరల్డ్‌కప్‌ను సైతం అందుకోవాలన్న కోరిక నాలో ఉంది" అని హార్థిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. లీగ్ దశలో చెన్నైని రెండు సార్లు ఓడించిన ముంబై తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో కూడా ఓడించడంపై పాండ్యా స్పందించాడు.

"ఐపీఎల్ ఫైనల్లో మళ్లీ చెన్నై ఎదురుపడినప్పుడు చాలా మంది ఆ జట్టునే హాట్ ఫేవరిట్‌గా చెప్పుకొచ్చారు. మూడు మ్యాచ్‌లను ఓడిన చెన్నై నాలుగో మ్యాచ్‌ని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ, నేను మాత్రం ఫైనల్లోనూ మాదే విజయమని నమ్మాను. అనుకున్నట్లే ఫైనల్లో గెలిచి ట్రోఫీని అందుకున్నాం" అని పాండ్యా అన్నాడు.

ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2017లో టైటిల్ గెల్చుకున్న ముంబై జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే జట్టు తరుఫున ఐపీఎల్‌లో మరోసారి ట్రోఫీని గెలవడంలో కీలకపాత్ర పోషించారు.

మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "నా తమ్ముడు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నాడు. వేరెవరినో మార్గదర్శకుడిగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, సోదరుడే నాకు స్ఫూర్తి. ఐపీఎల్ ఫైనల్లో తమ జట్టు గెలవడం చాలా సంతోషంగా ఉంది. నా సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను" అని అన్నాడు. కాగా, మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు దక్కగా... కృనాల్ పాండ్యాకు చోటు దక్కలేదు.

Story first published: Tuesday, May 14, 2019, 19:08 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X