For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇది మంచి పునరాగమనం.. ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తా'

ICC Cricket World Cup 2019: Great win and we hope to keep the ball rolling says David Warner

బాల్ ట్యాంపరింగ్‌ వివాదం అనంతరం తొలి మ్యాచ్ ఆడాను. ఇది మంచి పునరాగమనం. ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తా అని ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. శనివారం ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో డేవిడ్‌ వార్నర్‌ (89; 114 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించి 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మాట్లాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తా:

ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తా:

'ఇది చాలా పెద్ద విజయం. మ్యాచ్‌కు ముందు కొద్దిగా ఒత్తిడికి గురయ్యాను. అయితే ఫించ్ తన మార్క్ బ్యాటింగ్ తో ఒత్తిడి తగ్గించాడు. గత సంవత్సరం నుండి కేవలం టీ-20లు మాత్రమే ఆడడంతో.. ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంబించా. బాల్ ట్యాంపరింగ్‌ వివాదం అనంతరం తొలి మ్యాచ్ ఆడా. ఇది నాకు మంచి పునరాగమనం. ఈ ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తా' అని వార్నర్‌ ఆశాభావం వ్యక్తం చేసాడు.

ఇదే దూకుడు కొనసాగిస్తాం:

ఇదే దూకుడు కొనసాగిస్తాం:

'ఆస్ట్రేలియా జట్టు ఇంతకు ముందులా లేదు. అప్పుడు అందరూ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుత జట్టుకు మంచి ఎనర్జి ఉంది. జట్టు సభ్యుల మధ్య మంచి వాతావరణం ఉంది. ఈ మ్యాచ్‌ కోసం మేం నాలుగు రోజుల ముందే సన్నద్ధమయ్యాం. అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మిగతా మ్యాచులలో కూడా ఆసీస్‌ ఇదే దూకుడు కనబరుస్తుంది' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

వార్నర్‌ అర్ధ సెంచరీ:

వార్నర్‌ అర్ధ సెంచరీ:

2019 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ (3/40), ఆడమ్‌ జంపా (3/60), స్టాయినిస్‌ (2/37)ల ధాటికి అఫ్గాన్‌.. 38.2 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. నజీబుల్లా జాద్రాన్‌ (51; 49 బంతుల్లో 7×4, 2×6) అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (89 నాటౌట్‌; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ ఫించ్‌ (66; 49 బంతుల్లో 6×4, 4×6) సమయోచిత ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని ఆసీస్‌ 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Story first published: Sunday, June 2, 2019, 13:38 [IST]
Other articles published on Jun 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+