'నాలుగో పేసర్ లేకపోవడం భారత జట్టుకు లోటే'

మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో నాలుగో పేసర్ లేకపోవడం భారత జట్టుకు లోటే అని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ జట్టు ఎంపిక చేసినప్పటి నుండి సెలెక్టర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జట్టు కూర్పుపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు చేశారు.

మాజీల విమర్శలు:
ముఖ్యంగా నాలుగో స్థానంపై, వికెట్ కీపర్ విషయంలో మాజీలు బాహాటంగానే తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం నాలుగో పేసర్ అంశం కూడా చర్చకు వచ్చింది. బుమ్రా, భువనేశ్వర్, షమీలతో పాటు మరో స్పెసలిస్ట్ పేసర్‌ను తీసుకుంటే బాగుండేదనేదని పలువురు బహిరంగానే చెప్పారు. తాజాగా గంభీర్ కూడా ఈ అంశంపై స్పందించాడు.

మరో పేస్ బౌలర్ ఉంటే బాగుండేది:
'ప్రస్తుత భారత పేస్ విభాగం బాగుంది. బుమ్రా, షమీ, భువీలు అద్భుతాలు చేస్తారనే నమ్మకం ఉంది. వీరికి తోడు మరో పేస్ బౌలర్ ఉంటే.. వారికీ మరింత సపోర్ట్ ఉండేది. ప్రస్తుతం పేస్ విభాగంలో ఒక సీమర్ తక్కువయ్యాడు. ఇది కచ్చితంగా భారత జట్టుకు లోటే. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లైన హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్‌లు ఉన్నా కూడా వారిని నేను ఏకీభవించను. స్పెషలిస్టు పేసర్‌కు ఆల్ రౌండర్లకు చాలా తేడా ఉంటుంది' అని గంభీర్ పేర్కొన్నారు.

టీమిండియా ఆశలు బుమ్రానే:
'ఇంగ్లండ్‌లో వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. మరోవైపు అక్కడి వాతావరణం కూడా వేడిగానే ఉంటుంది. బుమ్రా రాణించడంపైనే ప్రపంచకప్‌లో టీమిండియా ఆశలు పెట్టుకుంది, మరి ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి. ఈ ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం' అని గంభీర్ అబిప్రాయపడ్డాడు.

ఆసీస్ బలమైన జట్టు:
'మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు జట్టులోకి తిరిగి రావడంతో సమతుల్యంగా మారింది. కచ్చితంగా ఆసీస్ బలమైన జట్టు. ఐసీసీ ట్రోఫీలలో ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా జయించాలో ఆ జట్టు బాగా తెలుసు. ఆసీస్ జట్టును ఓడించాలంటే అన్ని జట్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే' అని గంభీర్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications