For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీఫైనల్‌లో అతడే కీలకం.. ప్రపంచకప్‌ టీమిండియాదే

ICC Cricket World Cup 2019, for India vs New Zealand: Krishnamachari Srikkanth believes that Jasprit Bumrah will be key man in the semi finals match

న్యూజిలాండ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కీలకం కానున్నాడని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డారు. ఒకవైపు ఓపెనర్ రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలు చేయడం, మరోవైపు జస్‌ప్రీత్‌ బుమ్రా 17 వికెట్లతో రాణించడంతో టీమిండియా సునాయాసంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఇద్దరికి కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడ, బౌలర్ల ప్రదర్శన కూడా తోడవ్వడంతో టీమిండియా వరుస విజయాలు సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బుమ్రా కీలకం:

బుమ్రా కీలకం:

ప్రపంచకప్‌ సెమీస్‌ సమరానికి ముందు అటు క్రికెటర్లు, ఇటు విశ్లేషకుల అంచనాలు జోరందుకున్నాయి. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ టీమిండియాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'టీమిండియా వరుస విజయాలను అందుకోవడంలో బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. టీమిండియాకు బౌలింగ్‌లో అతడే ప్రధాన ఆయుధం. మిగతా బౌలర్లకు ఆదర్శంగా నిలిచే ప్రదర్శన చేస్తున్నాడు' అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

బంతితో అద్భుతాలు చేయగలడు:

బంతితో అద్భుతాలు చేయగలడు:

'బుమ్రా కొత్త బంతితో అతను అద్భుతాలు చేయగలడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న జోడీని కూడా విడదీయగల సత్తా ఉంది. ఇక డెత్ ఓవర్లలో అతడి ప్రదర్శన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే డెత్‌ ఓవర్లలోనూ అదే జోరు సాగిస్తున్నాడు. లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో అదే నిరూపితమైంది' అని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చారు.

ఫామ్‌లో రోహిత్:

ఫామ్‌లో రోహిత్:

ఓపెనర్‌ రోహిత్‌శర్మ ప్రదర్శన బాగుంది. టోర్నీలో ఇప్పటికే ఐదు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న రోహిత్‌ మొదటి పవర్‌ప్లేలో పరుగులు చేయకున్నా.. తర్వాత పుంజుకుంటాడు. చాలామంది ఆటగాళ్లు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ రోహిత్‌ నెమ్మదిగా ఇన్నింగ్ ఆరంభించినా.. చివర్లో ప్రమాదకరంగా మారతాడు. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. కచ్చితంగా కప్ టీమిండియాదే' అని శ్రీకాంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

డెత్ ఓవర్లలో అద్భుతం:

డెత్ ఓవర్లలో అద్భుతం:

తాజాగా మీడియా సమావేశంలో సచిన్ కూడా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడానికి రోహిత్‌ శర్మ కృషికి సమానంగా బుమ్రా కూడా కష్టపడ్డాడు. వికెట్లు తీయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టు విజయాల్లో మాత్రం తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ అద్భుతం. కీలక సమయాల్లో బంతిని అందుకుని ఫలితం రాబడుతున్నాడు' అని సచిన్ అన్నారు.

తొలి సెమీఫైనల్‌:

తొలి సెమీఫైనల్‌:

లీగ్ దశలో టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఇంగ్లండ్‌పై మాత్రమే ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ చేతుల్లో ఓడిపోయి 11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. దీంతో మంగళవారం టేబుల్ టాపర్ టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది.

Story first published: Monday, July 8, 2019, 16:12 [IST]
Other articles published on Jul 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+