Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫ్యాన్ గైడ్: ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

ICC Cricket World Cup 2019: A fan guide to when, where and how to buy tickets

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను అభిమానులు కొనుగోలు చేసేందుకు గాను పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌ను ఐసీసీ గురువారం విడుదల చేసింది. ఐసీసీకి విడుదల చేసిన పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌ గురించి....

క్రికెట్ వరల్డ్ కప్ బ్యాలెట్‌ను ఐసీసీ ఎప్పుడు విడుదల చేసింది?
క్రికెట్ వరల్డ్ కప్ బ్యాలెట్‌ను ఐసీసీ ఆగస్టు 1(బుధవారం) విడుదల చేసింది. ఇది మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత అని కాకుండా అన్ని అప్లికేషన్స్‌కు సమ ప్రాధాన్యతను ఇస్తుంది.

ఎంతకాలం ఈ బ్యాలెట్ ఉంటుంది?
ఆగస్టు 29 సాయంత్రం 5 గంటల వరకు ఈ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

ఎవరెవరు ఈ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌‌లోకి ఎంటర్ కావొచ్చు?
వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ కోసం ఈ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌‌ను ఐసీసీ ప్రారంభించింది. ఇందులోకి క్రికెట్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఎంటర్ కావొచ్చు.

ఐసీసీ పబ్లిక్ బ్యాలెట్ సిస్టమ్‌‌‌లోకి ఎంటర్ కావడం ఎలా?

1. CWC19 టికెట్ వెబ్‌సైట్‌లో అకౌంట్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అంతకముందే అకౌంట్‌ను కలిగి ఉంటే మళ్లీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

2. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత 'మై అప్లికేషన్' ట్యాబ్‌పై క్లికే చేయాలి.

3. ఆ తర్వాత 'క్రియేట్ మై అప్లికేషన్' పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా వరల్డ్ కప్‌లో జరగనున్న 48 మ్యాచ్‌లను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.

4. మ్యాచ్‌లను ఎంపిక చేసుకుని టికెట్లను ఎంచుకోవాలి. ఆ తర్వాత టికెట్ ఆర్డర్‌ను ధృవీకరించాలి.

ఒక అభిమాని ఎన్ని మ్యాచ్‌లకు అప్లై చేసుకోవచ్చు?
మ్యాచ్‌లపై పరిమితి అంటూ లేదు. బ్యాలెట్‌లో అభిమానులు ఎన్ని మ్యాచ్‌లకైనా టికెట్లను కోనుగోలు చేయొచ్చు.

బ్యాలెట్‌లో సక్సెస్‌పుల్ అని మనం ఎప్పుడు చూడొచ్చు?
ఈ బ్యాలెట్‌లో మ్యాచ్ టికెట్ల కోసం అప్లై చేసుకున్న వారు సెప్టెంబర్ నాటికి ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను పొందగలరు.

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌ ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, August 2, 2018, 15:39 [IST]
Other articles published on Aug 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+