Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాబియన్‌ అలెన్‌ స్టన్నింగ్ క్యాచ్: భారంగా పెవిలియన్‌కు మెండిస్ (వీడియో)

ICC Cricket world CUp 2019: Fabian Allen takes a blinder to dismiss Kusal Mendis

హైదరాబాద్: చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో విండిస్ స్పిన్నర్ ఫాబియన్‌ అలెన్‌ అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం శ్రీలంక-వెస్టిండిస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు శ్రీలంకను బ్యాటింగ్‌కు‌ ఆహ్వానించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాల జోడి లంకకు చక్కటి ఆరంభాన్ని అందించింది. వీరిద్దరూ 93 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కరుణరత్నే తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కుశాల్‌ పెవిలియన్‌ చేరినప్పటికీ అవిష్క ఫెర్నాండో-కుశాల్‌ మెండిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించారు.

వీరిద్దరి మూడో వికెట్‌కు 85 పరుగులు జత చేయడంతో లంక భారీ స్కోరు చేసింది. అయితే, ఫాబియన్‌ అలెన్‌ వేసిన 32వ ఓవర్‌ చివరి బంతిని కుశాల్‌ పెరీరా బౌలర్‌కు కుడి భాగం నుంచి దూరంగా ఆడాడు. అయితే, బంతి ఊహించిన దాని కంటే ఎక్కువగా గాల్లోకి లేచింది. అయితే, అమాంతం గాల్లోకి ఎగిరిన అలెన్‌ రెండు చేతులతో బంతిని అందుకున్నాడు.

దీంతో కుశాల్‌‌తో పాటు నిరాశగా క్రీజు వదిలి పెవిలియన్‌కు చేరాడు. అలెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు లంక బ్యాట్స్‌మెన్‌తో సహా జట్టులోని సహచర ఆటగాళ్లు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలెన్ స్టన్నింగ్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

అలెన్ స్టన్నింగ్స్ క్యాచ్‌పై ట్విట్టర్‌లో ఇలా:

Story first published: Monday, July 1, 2019, 19:45 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+