న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టోక్స్‌ అలా ఆలోచించకుండా ఉంటే.. చివరి బంతిని స్టేడియం దాటించేవాడు

ICC Cricket World Cup 2019 Final:England Chief Ashley Giles Dismisses World Cup Final 'Extra Run'Row
ICC Cricket World Cup 2019, Extra Run: England Chief Ashley Giles Dismisses World Cup Final


ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అలా రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే చివరి బంతిని స్టేడియం దాటించేవాడు అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆష్లీ గిల్స్‌ పేర్కొన్నాడు. ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

చివరి ఓవర్‌లో ఓవర్‌ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరగులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే ఇవ్వాలని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని ప్రముఖ అంపైర్‌ సైమన్‌ టోఫెల్‌ అన్నారు. ఫీల్డర్‌ బంతి విసరకముందే బ్యాట్స్‌మెన్‌ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని.. కానీ బెన్‌స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్‌ బంతిని విసిరాడు. దీంతో ఐదు పరుగులే ఇచ్చి రషీద్‌ను బ్యాటింగ్‌ చేయమని చెప్పాల్సి ఉండేదని టోఫెల్‌ మీడియాతో అన్నాడు.

ఈ ఓవర్‌ త్రో విషయమై మాట్లాడాల్సిందిగా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆష్లీ గిల్స్‌ను కోరగా... 'మీరొక విషయంపై చర్చించాలి. చివరి ఓవర్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ చివరి బంతిని బంతి లెగ్‌స్టంప్‌ మీద ఫుల్‌టాస్‌ వేసాడు. ఆ సమయంలో స్టోక్స్‌ రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే.. బంతిని స్టేడియం బయటకు పంపేవాడు. మేం విజేతలం అయ్యాం. కప్ మాకే వచ్చింది. దాన్ని మాతోనే పెట్టుకుంటాం' అని సమాధానం ఇచ్చాడు. ఆష్లీ గిల్స్‌ను ఒక విషయం అడిగితే మరో విషయంపై స్పందించడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

Story first published: Tuesday, July 16, 2019, 16:27 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X