
వరల్డ్‌కప్‌లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అప్పుడే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌ను కరుణరత్నె, కుశాల్ పెరీరా లు ఆరంభించారు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ మొదటి ఓవర్లో 2 పరుగులు ఇచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసంఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో ఓవర్ చివరి బంతికి కరుణరత్నె (1; 8 బంతుల్లో) ను పెవిలియన్ చేర్చాడు. కరుణరత్నె షాట్ ఆడగా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా కీపర్ బట్లర్ చేతుల్లోకి వెళ్ళింది. అనంతరం క్రిస్ వోక్స్ వేసిన 2.2వ బంతిని ఆడబోయిన కుశాల్ పెరీరా (2; 6 బంతుల్లో) మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో లంక మూడు పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టోర్నీలో ఈ ఇద్దరే ఇప్పటివరకు పరుగులు చేశారు. ఈ మ్యాచులో త్వరగా పెవిలియన్ చేరడంతో లంక ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి. ప్రస్తుతం క్రీజులో జీవన్ మెండిస్ (1), అవిష్క ఫెర్నాండో (6)లు ఉన్నారు. లంక 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. బౌలర్లలో ఆర్చర్, వోక్స్ తలో వికెట్ తీశారు.
ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా.. లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా.. రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లలో పోటీపడితే.. నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. లీడ్స్ మైదానంలో ఇది మొదటి ప్రపంచకప్ మ్యాచ్. ఈ వేదికపై ఇంగ్లాండ్ చివరి ఆరు వన్డేలను గెలుచుకుంది.
{headtohead_cricket_2_7}