న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన స్టోక్స్‌, ఆర్చర్‌.. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ శుభారంభం

ICC Cricket World Cup 2019: ENG v SA |England Won By 104 Runs On South Africa | Match Highlights
ICC Cricket World Cup 2019, England vs South Africa: Ben Stokes, Jofra Archer Star As England Thrash South Africa In Opener

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019ను ఆతిధ్య ఇంగ్లండ్‌ విజయంతో ఆరంభించింది. లండన్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్‌ హీరో జోఫ్రా ఆర్చర్‌ (3/27), స్టోక్స్‌(2/12)లు దక్షిణాఫ్రికా వెన్ను విరిసాడు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న బెన్‌ స్టోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

 ఆర్చర్‌ మెరుపులు:

ఆర్చర్‌ మెరుపులు:

భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. 8వ ఓవర్లో మార్‌క్రమ్‌ (11)ను ఔట్‌ చేసిన ఆర్చర్‌.. తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్‌ (5)నూ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ఓపెనర్ ఆమ్లా కూడా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఉండడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్లో ఆర్చర్‌ బౌన్సర్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో ఆమ్లా గాయపడ్డాడు.

 78 పరుగులకే 8 వికెట్లు:

78 పరుగులకే 8 వికెట్లు:

మరో ఓపెనర్ డికాక్‌కు దుసెన్‌ అండగా నిలవడంతో దక్షిణాఫ్రికా మంచి స్థితిలో నిలిచింది. 22 ఓవర్లలో 125/2తో పటిష్టంగా ఉంది. డికాక్‌ (68)ను ఔట్‌ చేసిన ప్లంకెట్‌.. 95 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై డుమిని (8), ప్రిటోరియస్ (1), దుసెన్‌ (50) అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఒక్క బ్యాట్స్‌మనూ క్రీజులో నిలవలేకపోయాడు. ఆమ్లా (13) మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చినా ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా 78 పరుగులకే తన చివరి ఎనిమిది వికెట్లు చేజార్చుకుని ఓడిపోయింది.

రెండో వికెట్‌కు 106 పరుగులు:

రెండో వికెట్‌కు 106 పరుగులు:

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్‌(51: 59 బంతుల్లో 5 ఫోర్లు)లు ఆదుకున్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్‌ రాయ్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్‌ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్‌-బెన్‌ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.

స్టోక్స్‌ సమయోచిత ఇన్నింగ్స్:

స్టోక్స్‌ సమయోచిత ఇన్నింగ్స్:

ఇయాన్‌ మోర్గాన్‌ (57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్‌ స్టోక్స్‌ ( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసారు. అనంతరం జోస్‌ బట్లర్‌ (18), మొయిన్‌ అలీ (3)లు నిరాశపరిచారు. అయితే బెన్‌ స్టోక్స్‌ సమయోచితంగా ఆడి స్కోరును మూడొందలు దాటించి 49 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు.

Story first published: Friday, May 31, 2019, 7:27 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X