Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ ఢీ.. ఇంగ్లండ్‌ను నిలువరించేనా?

ICC Cricket World Cup 2019 : England Vs Pakisthan Match Preview
ICC Cricket World Cup 2019, England vs Pakistan Prediction: Who will win England vs Pakistan World Cup 2019 match today preview

ప్రపంచకప్‌ తొలి పోరులో పటిష్ఠ సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్‌.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌ తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొననుంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. ఇంగ్లండ్‌ను నిలువరించేనా? అనే సందేహం. భారీ హిట్టర్లు ఉన్న ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌పై నిలువరించడం పాక్‌కు పెను సవాలే. ఇంగ్లండ్‌ రెండు వన్డే అత్యధిక స్కోర్లు (481/6 ఆస్ట్రేలియాపై), (444/3 పాకిస్తాన్‌పై) ఈ మైదానంలో నమోదు చేసింది. దీంతో ఈ రోజటి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్:

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్:

సౌతాఫ్రికాపై భారీ విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. సఫారీలతో మ్యాచ్‌లో బెయిర్‌స్టో, బట్లర్ తప్ప బ్యాట్స్‌మెన్ అందరూ పరుగులు చేశారు. రాయ్, రూట్, మోర్గాన్, స్టోక్స్ అర్ధ శతకాలు సాధించారు. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మరోసారి రెచ్చిపోతే పరుగుల వరద ఖాయం. స్టోక్స్ బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు ఓ మెరుపు క్యాచ్ కూడా పట్టాడు. ఇక బౌలర్లు కూడా సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా ఆర్చర్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఫిట్‌నెస్‌ సాధించిన పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఆడే అవకాశం ఉంది.

జమాన్, ఆజంల పైనే ఆశలు:

జమాన్, ఆజంల పైనే ఆశలు:

విండీస్ చేతిలో ఘోర పరాభవం తర్వాత పాకిస్థాన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో 105 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్, బాబర్ ఆజంల పైనే ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్, హఫీజ్, షోయబ్ రాణించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంగ్లండ్ పేస్ దళాన్ని పాక్ బ్యాట్స్‌మెన్ ఎంతవరకు ఎదుర్కొంటారన్నదే ఆసక్తికరం. బౌలర్ అమిర్ రాణిస్తుండడం పాక్ జట్టుకు సానుకూలాంశం. అసన్ అలీ, రియాజ్, వసీంలు రాణిస్తే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయొచ్చు.

గత రికార్డులు:

గత రికార్డులు:

పాక్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 87 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 31 మ్యాచ్‌ల్లోపాకిస్తాన్‌ గెలవగా.. ఇంగ్లండ్‌ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మూడింట్లో ఫలితం రాలేదు. ఇక ప్రపంచకప్‌లో 9 సార్లు తలపడగా.. చెరో నాలుగు విజయాలు సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు. 1992 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్ గెలిచి కప్ సొంతం చేసుకుంది. గతం ఎలా ఉన్నా.. ప్రస్తుతం మాత్రం ఇంగ్లాండ్ జట్టే ఫెవరెట్.

{headtohead_cricket_2_5}

Story first published: Monday, June 3, 2019, 10:24 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+