Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌ విజయంపై సానియా ట్వీట్‌.. ట్రోల్ చేస్తున్న అభిమానులు

ICC Cricket World Cup 2019, England vs Pakistan: Funny reactions after Sania Mirza congratulates Pakistans win

ప్రపంచకప్‌లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్‌.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. సోమవారం పాకిస్తాన్‌ ఆటగాళ్లు హఫీజ్ (84), ఆజామ్ (63), సర్ఫరాజ్ (55)లు అర్ధసెంచరీలు చేయడంతో 348 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్ విజయంపై సోషల్‌ మీడియాలో అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా కూడా ట్విటర్‌ వేదికగా తన భర్త షోయబ్ మాలిక్, పాక్ జట్టుకు అభినందనలు తెలిపింది. 'పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. పాక్ పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు సంచల విజయాలు సాదిస్తుందని మరోసారి రుజువైంది. పాక్‌ గెలుపుతో ప్రపంచకప్‌ మరింత ఆసక్తిగా మారనుంది' అంటూ ట్వీట్‌ చేసింది.

సానియా ట్వీట్‌పై భారత అభిమానాలు ట్రోల్ చేస్తున్నారు. 'జూన్‌ 16న భారత్ మ్యాచ్‌ ఉంది. మర్చిపోకు' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'భారత్ విజయంపై కూడా ఇలాగే ట్వీట్‌ చేయాలి' అని మరో నెటిజన్ ట్వీటాడు. 'జూన్‌ 16న పాక్‌పై భారత్ గెలుస్తుంది. టీమిండియాను పొగుడుతూ కామెంట్‌ చేయడం మర్చిపోకు' అంటూ మరో నెటిజన్ కామెంట్‌ చేసాడు.

ICC Cricket World Cup 2019, England vs Pakistan: Funny reactions after Sania Mirza congratulates Pakistans win

పాక్ జట్టు గత కొంత కాలంగా ఓటములతో సతమతమవుతోంది. చివరి 11 వన్డేల్లో పాక్‌ ఓడింది. తాజా విజయంతో చాలా రోజుల తర్వాత పాక్ గెలుపు రుచిని చూసింది. ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 16న చిరకాల ప్రత్యర్ధులు భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగడంపై స్పష్టత లేదు. అయితే మ్యాచ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాక్‌పై టీంఇండియాకు మెరుగైన రికార్డు ఉంది.

Story first published: Wednesday, June 5, 2019, 12:59 [IST]
Other articles published on Jun 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+