
ప్రపంచకప్‌లో భాగంగా చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. టీమ్ సౌతీ, మాట్ హెన్రీ జట్టులోకి వచ్చారు. లుకీ ఫెర్గుసన్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సెమీఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లకు ఈ మ్యాచ్ అసలు పరీక్ష. సెమీస్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా రెండు జట్లకు సెమీస్ అవకాశాలు మాత్రం పూర్తిగా మూసుకుపోవు. కానీ.. ముందుకెళ్లేది లేనిది వేరే జట్లపై ఆధారపడి ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడితే.. పాకిస్థాన్‌కు లాభం. ఎందుకంటే పాక్ తర్వాత బంగ్లాదేశ్‌పై నెగ్గితే ఆ జట్టు ఇంగ్లాండ్‌ను దాటి టాప్-4లో నిలిచే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఉండగా.. పాక్ 9 పాయింట్లతో ఉంది. ఇక ఇంగ్లాండ్‌పై కివీస్ గెలిస్తే.. 13 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఒకవేళ కివీస్ ఓడినా 11 పాయింట్లతో ఆ జట్టుకు ఇంకా సెమీస్ అవకాశం ఉంటుంది. ఎటొచ్చి ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కే కీలకం. ప్రపంచకప్‌లో ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. న్యూజిలాండ్ 5, ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు గెలిచింది.
Teams:
New Zealand: Martin Guptill, Henry Nicholls, Kane Williamson(c), Ross Taylor, Tom Latham(w), Colin de Grandhomme, James Neesham, Mitchell Santner, Tim Southee, Matt Henry, Trent Boult.
England: Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Ben Stokes, Jos Buttler(w), Chris Woakes, Liam Plunkett, Jofra Archer, Adil Rashid, Mark Wood.
{headtohead_cricket_2_4}