Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంఎస్ ధోనీపై కాదు.. కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి పెంచండి

ICC Cricket World Cup 2019, England vs India: Put KL Rahul Under Pressure, Not MS Dhoni says Sanjay Manjrekar

బర్మింగ్‌‌హామ్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో ముగిసిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్లో బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. లక్ష్య ఛేదనలో ధోనీ (42 నాటౌట్: 31 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12 నాటౌట్: 13 బంతుల్లో 1x4) మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి 31 బంతులు ఎదుర్కొని 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గెలిచే మ్యాచ్‌ చేజారడంతో.. ముఖ్యంగా ధోనీ స్లో బ్యాటింగ్‌పై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాహుల్‌పై ఒత్తిడి పెంచండి:

రాహుల్‌పై ఒత్తిడి పెంచండి:

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ధోనీకి మద్దతుగా నిలిచాడు. తాజాగా మంజ్రేకర్‌ మాట్లాడుతూ... 'మీడియా ధోనీపై ఎక్కువ దృష్టి సారించవద్దు. ఈ వయసులో ధోనీని విమర్శించడం సరికాదు. కేఎల్‌ రాహల్ కూడా అంతగా రాణించలేదు. టీమిండియా అభిమానే అయితే ధోనీపై కాదు.. కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి తీసుకురావాలి. యువకులు జట్టుని గెలిపించేందుకు బాధ్యతలు తీసుకోవాలి' అని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

మయాంక్‌ క్లాస్‌ ప్లేయర్‌:

మయాంక్‌ క్లాస్‌ ప్లేయర్‌:

'వార్మప్ మ్యాచ్‌ల్లో ధోనీ బ్యాటింగ్‌ చూసి సంతోషించా. అతడిపై మరింత ఒత్తిడి పెంచొద్దు. ధోనీ ఎన్ని పరుగులు చేసినా అవసరం లేదు.. అతను ఆత్మరక్షణలో ఆడటం అర్థంచేసుకోగను. పంత్, రాహుల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. కీలక సమయంలో వారు గాడిలో పడితే తిరుగుండదు. విజయ్‌ శంకర్‌కి బదులు మయాంక్‌ అగర్వాల్‌ని ఎంపిక చెయ్యడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మయాంక్‌ క్లాస్‌ ప్లేయర్‌' అని మంజ్రేకర్‌ కొనియాడాడు.

ఇలా ఆడడం తగదు:

ఇలా ఆడడం తగదు:

'ఈ ఆట గురించి చెప్పడానికి, సింగిల్స్ గురించి తన దగ్గర సమాధానం లేదు. చేతిలో 5 వికెట్లు ఉన్నప్పుడు ఒక సీనియర్ ఆటగాడు ఇలా ఆడడం తగదు. గెలిచినా, ఓడినా సరే.. భారీ షాట్లతో పరుగులు తీయాల్సి ఉంది. సమయాన్ని బట్టి ధోనీ రిస్క్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ నేర్చుకోవలసిన అవసరం కూడా అంతే ఉంది' అని మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, July 2, 2019, 12:42 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+