
త్వరలో టీమిండియా జెర్సీ మారనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లీసేన.. తొలిసారి ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనుంది. కేవలం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు మ్రాతమే కోహ్లీసేన ఆరెంజ్ జెర్సీతో ఆడనుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ నెల 30న కోహ్లిసేన ఆరెంజ్ జెర్సీలో ఆడనుంది. ఇన్ని రోజులు బ్లూ జెర్సీలో కనిపించిన భారత ఆటగాళ్లు.. రెంజ్ జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బ్లూ జెర్సీతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. భారత్ జట్టు జెర్సీ రంగు కూడా బ్లూ కావడంతో అభిమానులతో సహా అందరూ అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ జెర్సీ రంగులు క్లాష్ కాకుండా ఒక్కో జట్టుకు ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయ జెర్సీనే కోహ్లీసేన వాడనుంది
ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనే జట్లు అన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. జట్లన్నీ ఒక రంగునే టోర్నీ మొత్తం కొనసాగించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఇక ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వడంతో ఆ జట్టు అదే జెర్సీతో బరిలోకి దిగనుంది కాబట్టి.. భారత్ ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగాలి.
శనివారం జరిగే అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కే భారత జట్టు ఆరెంజ్ జెర్సీలో మ్యాచ్ ఆడాలి. కానీ ఆ మ్యాచ్‌కు అఫ్గాన్ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుండటంతో.. భారత్ తన బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగుతోంది. టోర్నీలో ఇప్పటికే కొన్ని జట్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగగా.. మరిన్ని జట్లు కొత్త జెర్సీలతో ఆడనున్నాయి.