For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌తో ఓటమి.. క్రీడాస్ఫూర్తి ఎక్కడుందంటూ కోహ్లీసేనపై విమర్శలు

ICC Cricket World Cup 2019 : Waqar Younis Slams Team India After India VS England Match || Oneindia
ICC Cricket World Cup 2019, England vs India: Former Pakistan Captain Waqar Younis Questions Indias Sportsmanship

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టీమిండియా ఓటమిపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యునిస్‌ పరోక్షంగా కోహ్లీ సేనపై విమర్శలు చేసాడు. క్రీడాస్ఫూర్తి ఎక్కడుందంటూ వకార్‌ ప్రశ్నించాడు. ఇంగ్లాండ్‌ గెలుపుతో పాక్‌కు దాదాపు సెమీస్‌ అవకాశాలు మూసుకుపోయిన నేపథ్యంలో ఈ విధంగా తనలోని కసిని బయటపెట్టాడు.

తప్పకుండా గెలవాలి:

తప్పకుండా గెలవాలి:

ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. నాలుగు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓడిపోయింది. ఇక ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో పాక్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌ సెమీస్‌ చేరాలంటే 5న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అంతకన్నా ముందు ఇంగ్లండ్‌ జట్టు కివీస్‌పై ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.

టోర్నీ నుంచి పంపేందుకు:

టోర్నీ నుంచి పంపేందుకు:

ఆదివారం టీంఇండియా చేతిలో ఇంగ్లండ్ ఓడితే పాక్‌కు సెమీస్ అవకాశాలు మరింత సులువయ్యేయి. అయితే ఇంగ్లాండ్‌తో చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పాక్‌కు సెమీస్ అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో పాక్‌ను టోర్నీ నుంచి బయటకు పంపేందుకు టీమిండియా కావాలనే ఓడిపోయిందని ఆ దేశానికే చెందిన క్రికెటర్లు బసిత్‌ అలీ, సికిందర్‌ భక్త్‌ ఆరోపించారు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ వకార్‌ యునిస్‌ కూడా చేరాడు.

సెమీస్‌ చేరుతుందో లేదో బాధ లేదు:

సెమీస్‌ చేరుతుందో లేదో బాధ లేదు:

తాజాగా వకార్‌ యునిస్‌ మాట్లాడుతూ... 'నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు. జీవితంలో నువ్ చేసేదే నువ్వు ఎవరు అనేది తెలుపుతుంది. పాకిస్తాన్ సెమీస్‌కు చేరుతుందో లేదో నాకు బాధ లేదు కానీ.. ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంది. కొందరు ఛాంపియన్ల క్రీడాస్ఫూర్తిని పరీక్షించగా.. అది తీవ్రంగా విఫలమైంది' అంటూ #INDvsEND హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించి ట్వీట్ చేశారు.

భారత్‌ ఓటమి:

భారత్‌ ఓటమి:

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్, 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జానీ బెయిర్‌స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేసాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మొహమ్మద్‌ షమీ ఐదు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (76 బంతుల్లో 66; 7 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరిసినా.. ధోనీ, జాదవ్ నెమ్మదైన బ్యాటింగ్ వల్ల టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 31 పరుగుల తేడాతో ఓడింది.

Story first published: Tuesday, July 2, 2019, 11:44 [IST]
Other articles published on Jul 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+