జేసన్ రాయ్ భారీ శతకం.. బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం

పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమని చవిచూసిన ఇంగ్లాండ్.. పుంజుకుని అదరగొట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్ (153; 121 బంతుల్లో 14×4, 5×6) భారీ శతకం సాదించడంతో.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, స్టోక్స్ బంగ్లా పని పట్టారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరంభంలోనే షాక్:
387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (2) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షకీబ్ అల్ హసన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (19)తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అనంతరం ముష్ఫీకర్ రహీమ్ (50 బంతుల్లో 44; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీంతో బంగ్లా 28.5 ఓవర్లలో 169/2తో నిలిచింది.

షకిబ్ సెంచరీ చేసినా:
ఈ క్రమంలో షకీబ్ 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షకీబ్, రహీమ్ జోడీ మూడో వికెట్‌కు 106 పరుగులు జోడించింది. అయితే ఒక్క పరుగు తేడాతో ముష్ఫికర్, మిథున్ (0)లను ప్లంకెట్, రషీద్ ఔట్ చేయడంతో బంగ్లాకు గట్టి దెబ్బ తగిలింది. మహ్మూదుల్లా (28) అండతో షకీబ్ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 40వ ఓవర్లో షకిబ్ (121; 119 బంతుల్లో 12×4, 1×6)ను స్టోక్స్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైపోయింది. బంగ్లా చివరి పది ఓవర్లలో విజయానికి 163 పరుగులు చేయాల్సిన స్థితిలో.. మిగతావారు ఔట్ అవ్వడంతో 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది.
128 పరుగుల భాగస్వామ్యం:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో దూకుడుతో స్కోరు బోర్డు పరుగుపెట్టింది. ముఖ్యంగా రాయ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేసాడు. మరోవైపు బెయిర్‌స్టో కూడా అర్ధ శతకం అందుకున్నాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించాక బెయిర్‌స్టో ఔటయ్యాడు. రూట్ (21) కూడా ఆకట్టుకోలేదు.

ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్:
రాయ్‌కు బట్లర్ తోడవడంతో మళ్లీ పరుగుల ప్రవాహం పెరిగింది. రాయ్ 92 బంతుల్లో సెంచరీ చేసాడు. ఇక ఇంగ్లండ్ 30.4 ఓవర్లలోనే 200 స్కోరు చేసింది. సెంచరీ తర్వాత జేసన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మెహదీహసన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6 కొట్టిన రాయ్.. మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నిష్క్ర మించాడు. కెప్టెన్ మోర్గాన్ 35 పరుగులు చేయగా, స్టోక్స్ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో ప్లంకెట్ (9 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), వోక్స్ (18 నాటౌట్) 45 పరుగులు జోడించారు. జేసన్ రాయ్‌కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications