
ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లార్డ్స్ మైదానం వేదికగా మరికొద్ది సేపట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆతిథ్య ఇంగ్లండ్ తలపడనుంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఓపెనర్ జేసన్ రాయ్ బరిలోకి దిగడం లేదు. మరోవైపు ఆసీస్ రెండు మార్పులు చేసింది. జేసన్ బెండ్రాఫ్, నాథన్ లయన్‌లు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించిన ఆసీస్.. ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. శ్రీమరోవైపు లంక చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్.. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఇప్పటివరకు 147 వన్డేలు ఆడాయి. ఆసీస్ 81 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 61 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు 'టై' కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు ఇంగ్లండ్, ఐదుసార్లు ఆస్ట్రేలియా గెలిచాయి.
జట్లు:
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్స్, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జొస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.
ఆస్ట్రేలియా: అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, జేసన్ బెండ్రాఫ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్.