For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌-అఫ్గాన్‌ మ్యాచ్.. ఇంగ్లండ్‌ రికార్డులు ఇవే!!

ICC Cricket World Cup 2019 : England Team Records In WC Against The Match With Afghanistan
ICC Cricket World Cup 2019, England vs Afghanistan: Record Breaking ion Morgan Scales New Heights by Smashing 17 Sixes, England records

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం అఫ్గాన్‌తో జరిగిన పోరులో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు) సెంచరీ చేసాడు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ అఫ్గానిస్తాన్‌పై చెలరేగి పలు రికార్డులు నెలకొల్పారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

* మోర్గాన్ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 సిక్సర్లతో వన్డేల్లో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అంతకుముందు రోహిత్ శర్మ (16), వాట్సన్ (16), క్రిస్ గేల్ (16), ఏబీ డివిలియర్స్ (16) సిక్సుల రికార్డు బద్దలైంది.

* 17 సిక్సర్లతో ఒక ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి రికార్డు సృష్టించాడు.

* మోర్గాన్ బాదుడుకు ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ దారుణంగా పరుగులు ఇచ్చాడు. 9 ఓవర్లలో 110 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ జట్టు 11 సిక్సర్లు బాదింది. ఒక వన్డేలో ఓ బౌలర్‌ సమర్పించుకున్న అత్యధిక సిక్సర్లు ఇవే. 11 సిక్సర్లలలో మోర్గాన్‌ ఒక్కడే 7 సిక్సర్లు బాదాడు.

* ఈ ఒక్క మ్యాచ్‌లో మోర్గాన్‌ 17 సిక్సర్లు బాదితే.. ఇంగ్లాండ్‌ నాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్‌ కెరీర్‌ మొత్తంలో 10 సిక్సర్లు బాదాడు. మరో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ 15 సిక్సర్లు బాదాడు. ఇయాన్‌ మోర్గాన్ ఈ ఇన్నింగ్స్‌లో 148 పరుగులు చేస్తే.. 102 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి.

* మోర్గాన్‌ 57 బంతుల్లో సెంచరీ సాధించడంతో ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కెవిన్ ఒబ్రియన్‌ (50 బంతుల్లో ఇంగ్లండ్‌పై), మ్యాక్స్‌వెల్‌ (51 బంతుల్లో శ్రీలంకపై), ఏబీ డివిలియర్స్‌ (52 బంతుల్లో వెస్టిండీస్‌పై)లు ముందున్నారు.

* ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 25 సిక్సర్లు నమోదయ్యాయి. వన్డేలో ఓ జట్టు బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇంగ్లాండ్‌ బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై ఆ జట్టు 24 సిక్సర్లతో రికార్డు నెలకొల్పింది. 2015లో వెస్టిండీస్‌ 19 సిక్సర్లు బాదింది. దక్షిణాఫ్రికా (18 సిక్సర్లు), భారత్‌ (18 సిక్సర్లు)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.

* ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 397 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకిదే అత్యధికం. అయితే ప్రపంచకప్‌లో ఇది ఆరో అత్యధిక స్కోరు.

* మోర్గాన్‌, రూట్‌లు 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.

Story first published: Wednesday, June 19, 2019, 9:05 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+