For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ రోజు అతడిది కాదు.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌తో నేను సంతోషంగానే ఉన్నా

ICC Cricket World Cup 2019 : Gulbadin Naib Defends Rashid Khan After England Assault || Oneindia
ICC Cricket World Cup 2019, England vs Afghanistan: Rashid Khan is a Star Player, This is not his Day, Afghanistan captain Gulbadin Naib defends Rashid Khan after England assault

క్రికెట్‌లో ఇలాంటివి అన్నీ సర్వసాధారణం. స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌తో నేను సంతోషంగానే ఉన్నా అని అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఆతిధ్య ఇంగ్లండ్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 150 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

9 ఓవర్లు 110 పరుగులు:

ఇంగ్లండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో అఫ్గనిస్తాన్‌ బౌలర్లు అందరూ బలయ్యారు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌. ఈ స్టార్ స్పిన్నర్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్‌ చేసి 110 పరుగులు ఇచ్చాడు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేదు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ జట్టు 11 సిక్సర్లు బాదింది. మోర్గాన్‌ ఒక్కడే 7 సిక్సర్లు బాదాడు. 110 పరుగులు సమర్పించుకోవడంతో ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌గా రికార్డు కావడం విశేషం. ఇక వన్డేల్లో అయితే అత్యంత ఎక్కువ పరుగులిచ్చిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

 నిరాశ చెందలేదు:

నిరాశ చెందలేదు:

మ్యాచ్‌ అనంతరం గుల్బదిన్‌ మీడియాతో మాట్లాడుతూ... 'రషీద్‌ ప్రపంచ క్రికెట్‌లో స్టార్‌ ప్లేయర్‌. అతను ఎంత మంచి బౌలరో అందరికీ తెలుసు. ఎలాంటి వారికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అతడిది కాదు. కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేయొచ్చు. మరికొన్ని సార్లు చేయకపోవచ్చు. క్రికెట్‌లో ఇలాంటివన్నీ సర్వసాధారణం. రషీద్‌ బౌలింగ్‌తో నేను సంతోషంగానే ఉన్నా. ఎలాంటి నిరాశ చెందలేదు' అని గుల్బదిన్‌ తెలిపాడు.

రోజురోజుకు మెరుగౌవుతోంది:

రోజురోజుకు మెరుగౌవుతోంది:

'రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మోర్గాన్‌ క్యాచ్‌ను దవ్లత్‌ తప్పుగా అంచనా వేశాడు. అదే ఓటమికి ప్రధాన కారణం. 30 ఓవర్ల వరకు మ్యాచ్ బాగానే సాగింది. మోర్గాన్‌ క్యాచ్‌ పట్టింటే ఫలితం మరోలా ఉండేదేమో. ఏదేమైనా అతను బాగా ఆడాడు. మా జట్టు రోజురోజుకు మెరుగౌవుతోంది' అని గుల్బదిన్‌ పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌ భారీ విజయం:

ఇంగ్లండ్‌ భారీ విజయం:

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో హష్మతుల్లా (74), రహ్మత్‌ (46), అఫ్గాన్‌ (44) మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, రషీద్‌ తలో మూడు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్ (148), బెయిర్‌ స్టో (90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌ (88: 82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌), మొయిన్‌ అలీ (31: 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) చెలరేగారు.

{document1}

Story first published: Wednesday, June 19, 2019, 11:47 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+