For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇప్పటికీ క్లైవ్ లాయిడ్ నా కంటే సిక్సర్లు బలంగా బాదగలడు'

ICC Cricket World Cup 2019 : Clive Lloyd Can Still Hit Bigger Sixes Than Me : Eoin Morgan
ICC Cricket World Cup 2019, England vs Afghanistan: Clive Lloyd can still hit bigger sixes than me says England skipper Eoin Morgan

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ నా కంటే బంతిని బలంగా బాదగలడు అని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 150 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) భారీ శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మోర్గాన్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం సిక్సులు, బౌండరీలతోనే పరుగులను డీల్ చేసాడు. 148 పరుగులు చేస్తే అందులో బౌండరీ (17 సిక్సులు, 4 ఫోర్లు)ల ద్వారా వచ్చినవే 118 పరుగులు. మ్యాచ్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ...' ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్నా ఇంతలా బ్యాటింగ్‌ చేస్తాననుకోలేదు. ఎక్కువగా బౌండరీలతోనే డీల్ చేయడంతో అలసిపోలేదు. పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది' అని మోర్గాన్ తెలిపాడు.

'జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. నా వయసే పెద్దగా ఉంది అనుకుంటున్నా. ఇలాంటి ఇన్నింగ్స్ అడగల వాళ్ళు జట్టులో ఉన్నారు. యువకులతో కలిసి పోటీపడటం నచ్చింది. ఇప్పుడు కూడా క్లైవ్ లాయిడ్ నా కంటే బంతిని బలంగా బాదగలడు. భారీ సిక్సులు కూడా కొట్టగలడు. పిచ్ బాగుంది. రూట్, బెయిర్‌స్టో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. స్టోక్స్ బౌలింగ్ సూపర్. స్కూప్, స్వీప్ షాట్లతో కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు ఇంతకుముందు కంటే బలంగా ఉన్నాను. వచ్చే మూడు మ్యాచులు మాకు చాలా కీలకం. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వం' అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో హష్మతుల్లా (74), రహ్మత్‌ (46), అఫ్గాన్‌ (44) మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, రషీద్‌ తలో మూడు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్ (148), బెయిర్‌ స్టో (90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌ (88: 82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌), మొయిన్‌ అలీ (31: 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) చెలరేగారు.

Story first published: Wednesday, June 19, 2019, 15:41 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+