'ఎలాంటి జట్టునైనా ఓడించగలం.. సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌దే విజయం'

తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగలం. ప్రస్తుతం అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాం. సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌దే విజయం అని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ ప్లంకెట్ ధీమా వ్యక్తం చేసాడు. జూలై 11న బర్మింగ్‌హామ్ వేదికగా రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనున్న నేపథ్యంలో ప్లంకెట్ ఈ వ్యాఖ్యలు చేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జట్టు పటిష్టంగా ఉంది:
తాజాగా ప్లంకెట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'టోర్నీలో మేము ఎక్కడికి రావాలనుకున్నామో అక్కడికి చేరుకున్నాం. మంచి క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రపంచంలోని ఎవరినైనా ఓడించగలమని మాకు తెలుసు. ఒక సమయంలో వెనుకబడ్డా.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాం. గత ప్రపంచకప్‌లలో ఆడిన ఇంగ్లాండ్ జట్లతో పోల్చుకుంటే ప్రస్తుత జట్టు పటిష్టంగా ఉంది. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్నాం' అని ప్లంకెట్ తెలిపాడు.

ఎలాంటి జట్టునైనా ఓడించగలం:
'సెమీస్ మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే మరో విజయం దక్కుతుంది. తమదైన రోజున ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగలం. జట్టులో అందరూ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుత ఫామ్ ప్రకారం సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌దే విజయం. వచ్చే ప్రపంచకప్-2023 ఆడుతానో లేదో తెలియదు. ఈ ప్రపంచకప్ మాత్రం గెలిచి తీరుతాం' అని ప్లంకెట్ పేర్కొన్నాడు.

గురువారం రెండో సెమీస్:
గురువారం బర్మింగ్‌హామ్ వేదికగా రెండో సెమీస్ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మొదలైన మొదటి సెమీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్ బుధవారం కొనసాగనుంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొదలవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications