కొత్త జెర్సీతో బరిలోకి: ఈసారైనా ఇంగ్లాండ్ వరల్డ్‌కప్ కల నెరవేరేనా?

మే 30 నుండి ఇంగ్లాండ్ మరియు వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2019 ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు మార్పులు చేస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ కూడా మూడు మార్పులు చేసి తుది జట్టును ప్రకటించింది. మరోవైపు ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను కూడా ఆవిష్కరించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
1992 వరల్డ్‌కప్‌లో లైట్ బ్లూ జెర్సీనే:
ఈ కొత్త జెర్సీని మంగళవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆవిష్కరించింది. రెగ్యులర్‌గా ఇంగ్లండ్ జట్టు ధరించే డార్క్ బ్లూకు బదులుగా లైట్ కలర్‌లో ఈ జెర్సీలను డిజెన్ చేశారు. 1992 వరల్డ్‌కప్‌లో కూడా ఇంగ్లండ్ లైట్ బ్లూ జెర్సీలనే ఉపయోగించింది. అప్పుడు ఇంగ్లండ్ ఫైనల్స్‌కు వెళ్ళింది. మరి ఈ కొత్త జెర్సీతోనైనా ఇంగ్లండ్ రాత మారేనేమో చూడాలి.

మూడు మార్పులు:
ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ సెలక్టర్లు మంగళవారం 15 మందితో కూడిన తుది జట్టుని ప్రకటించారు. అంతకుముందు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో మూడు మార్పులు చేసారు. ఐర్లాండ్ సిరిస్‌తో పాటు పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్‌తో పాటు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేశారు. ఈ ముగ్గురి స్థానంలో డేవిడ్ విల్లీ, జోయి డేన్లే, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు.

దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తొలి పోరు:
ఈ నెల 30న జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడుతుంది. అంతకంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది.

ఇంగ్లాండ్ జట్టు:
ఇయామ్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, లియాం ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్సీ, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications