ప్రపంచకప్: మూడో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఇంగ్లాండ్ మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
1975 ప్రపంచకప్‌లో టీమిండియాపై నమోదు చేసిన 202 పరుగుల విజయం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాత అదే ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాపై నమోదు చేసిన 150 పరుగుల విజయం రెండో స్థానంలో ఉంది. తాజాగా ఆప్ఘనిస్థాన్‌పై ఇంగ్లాండ్ సాధించిన 150 పరుగుల తేడాతో విజయం మూడో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో సమిష్టి ప్రదర్శన చేసింది. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది.
ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లలో హష్మతుల్లా(74), రహ్మత్(46), అఫ్గాన్(44) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, రషీద్ తలో మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టోతో జో రూట్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో(90) ఔటయ్యాడు.
మోర్గాన్ ఆరంభం నుంచే దూకుడుగా
బెయిర్ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్ దానిని సెంచరీగా మలచేందుకు ఆ తర్వాత 21 బంతుల్నే తీసుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ
వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ. ఈ క్రమంలో మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు.
అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు
ఈ క్రమంలోనే ఓవరాల్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు బాదిన రికార్డును కూడా మోర్గాన్ సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్‌లు బాదిన 16 సిక్సులే ఇప్పటివరకు అత్యధికం. ఈ మ్యాచ్‌లో 17 సిక్సులు బాది మోర్గాన్ ఆ రికార్డుని అధిగమించాడు. 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.
సిక్సర్ల వర్షం
అంతకముందు జోరూట్(88) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ మూడో వికెట్‌కు 189 పరుగులు, నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మోర్గాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్(2), స్టోక్స్(2) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లను చేజార్చుకోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications