న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిటన్‌ ప్రధానిని కలిసిన విశ్వవిజేతలు.. ఆటగాళ్లకు ప్రత్యేక విందు

ICC Cricket World Cup 2019 : England Players Meet Prime Minister Theressa May || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: England Players meet Prime Minister Theresa May at 10 Downing Street


ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టును బ్రిటన్‌ ప్రధాని 'థెరిసా మే' ప్రత్యేకంగా ఆహ్వానించింది. సోమవారం డౌనింగ్ స్ట్రీట్‌లోని థెరిసా మే కార్యాలయం వద్ద ఇంగ్లాండ్‌ జట్టు ఆమెను కలిసిసారు. ఈ సందర్భంగా థెరిసా మే ప్రపంచకప్‌తో ఫొటోలు దిగారు.

ప్రత్యేక విందు:

ఆటగాళ్లతో ప్రధాని థెరిసా మే కాసేపు ముచ్చటించింది. స్టార్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌తో చాలా సమయం మాట్లాడారు. అనంతరం ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు పాల్గొన్నారు. దీనికి సంబందించిన పోటోలను థెరిసా మే తన అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

భావితరాలకు స్ఫూర్తి:

భావితరాలకు స్ఫూర్తి:

'ఈ జట్టు భావితరాలకు స్ఫూర్తి. ఈ జట్టు గురించి భవిష్యత్తులో మాట్లాడుకుంటారు. ప్రపంచకప్‌ సాధించిన ఇంగ్లాండ్‌కు అభినందనలు' అని థెరిసా మే ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 'ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. దేశ క్రీడా చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంగ్లాండ్‌ కప్ సాధించినందుకు ఆనందంగా ఉంది' అని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

సూపర్ ఓవర్‌ కూడా టై:

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

Story first published: Tuesday, July 16, 2019, 14:21 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X