Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అన్ని మ్యాచ్‌ల లాంటిదే

ICC Cricket World Cup 2019 : Virat Kohli Says England Obsessed To Reach 500 Before Anyone Else
ICC Cricket World Cup 2019: England Obsessed To Reach 500 Before Anyone Else In World Cup says Virat Kohli

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భిన్నంగా చూడం. పాక్‌తో మ్యాచ్‌ మాకు అన్ని మ్యాచ్‌ల లాంటిదే. ఆ మ్యాచ్‌ను కూడా గెలవడానికి ప్రయత్నిస్తాం అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపారు. ప్రపంచకప్‌కు ఇంకా వారం సమయం కూడా లేదు. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం ఏర్పాటు చేసిన కెప్టెన్ల అధికారిక సమావేశంలో కెప్టెన్లంతా పాల్గొన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్‌తో మ్యాచ్‌ అన్ని మ్యాచ్‌ల లాంటిదే:

పాక్‌తో మ్యాచ్‌ అన్ని మ్యాచ్‌ల లాంటిదే:

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ... 'పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను అభిమానులు బావోద్వేకంతో భిన్న కోణంలో చూస్తారు. అభిమానులు చూసినట్లుగా మేము చూడం. మైదానంలో అడుగుపెట్టినప్పుడు ప్రత్యర్థి ఎవరైనా ఒక్కటే. పాక్‌తో మ్యాచ్‌ మాకు అన్ని మ్యాచ్‌ల లాంటిదే. అన్ని మ్యాచ్‌ల్లాగే ఆ మ్యాచ్‌ను కూడా గెలవడానికి ప్రయత్నిస్తాం' అని కోహ్లీ అన్నారు.

250 పరుగులు కూడా కాపాడుకోచ్చు:

250 పరుగులు కూడా కాపాడుకోచ్చు:

'భారీ స్కోర్లతో టోర్నీ జరుగుతుంది. 350 పరుగులు చేసినా గెలుపుపై ధీమా ఉండదు. మొదట్లో 300లకు పైగా స్కోర్లు ఛేదించినా.. మ్యాచ్‌లు జరిగే కొద్దీ పిచ్‌లు మారిపోతాయి కాబట్టి 250 పరుగులు కూడా కాపాడుకోచ్చు. ఈ ప్రపంచకప్‌లో 500 సాధ్యమయితే.. అది ఇంగ్లాండ్‌ జట్టే సాధిస్తుంది. అందరికన్నా ముందు ఆ స్కోరు చేయాలని వాళ్లు తహతహలాడుతున్నారు' అని విరాట్ తెలిపారు.

బలమైన ప్రత్యర్థి ఇంగ్లండే:

బలమైన ప్రత్యర్థి ఇంగ్లండే:

'ఈ టోర్నీలో ఇంగ్లండ్‌తో కష్టాలు తప్పవు. సొంతగడ్డపై అనుకూలతలు వారికి అనుకూలిస్తాయి. టోర్నీలో బలమైన ప్రత్యర్థి ఏదైనా ఉంటే అది ఇంగ్లండే. అయితే అన్ని జట్లు కూడా తమదైన రోజున చెలరేగుతాయి. జట్లన్నీ సమతూకంతో ఉన్నాయి. ప్రతి జట్టు మరో జట్టుతో ఢీకొట్టే టోర్నీ ఇది. నా దృష్టిలో అత్యంత రసవత్తరమైన ప్రపంచకప్‌గా ఈ టోర్నీ నిలుస్తుంది' అని కోహ్లీ పేర్కొన్నారు.

ఆసీస్‌లా అంకితభావంతో ఆడాలి:

ఆసీస్‌లా అంకితభావంతో ఆడాలి:

'ఆస్ట్రేలియాతో సిరీస్‌ నుంచి మేం చాలా నేర్చుకున్నాం. 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇంకోక మ్యాచ్ గెలవడం కష్టమేమీ కాదని అనుకున్నాం. కానీ ఆస్ట్రేలియా పట్టుదలతో ఆడి సిరీస్ గెలిచింది. ప్రపంచకప్‌లోని ఏ జట్టు అయినా ఆసీస్‌లా అంకితభావంతో ఆడాలి' అని విరాట్ అన్నారు.

Story first published: Friday, May 24, 2019, 11:17 [IST]
Other articles published on May 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+