
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ స్టార్ హ్యారీ కేన్ సరదాగా క్రికెట్ ఆడాడు. ప్రపంచకప్‌లో భాగంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లార్డ్స్‌లో విరాట్‌ను హ్యారీ కేన్ కలిశాడు. కోహ్లీతో కలిసి క్రికెట్ కూడా ఆడాడు. కోహ్లీ బంతులు వేయగా.. హ్యారీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం కోహ్లీ ఫుట్‌బాల్ ఆడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ వీడియోను హ్యారీ కేన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. క్రికెట్ ఆటే కాదు.. కోహ్లీ ఫుట్‌బాల్ కూడా బాగా ఆడుతున్నాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వచ్చే మ్యాచ్‌ల్లో భారత్ రాణించాలని.. కోహ్లీకి గుడ్‌లక్ చెప్పడం గమనార్హం.
'లార్డ్స్‌లో విరాట్ కోహ్లీతో కొద్ది సమయం గడిపాను. చాలా ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో మిగతా మ్యాచుల్లో భారత్ రాణించాలని కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాను. ఒక్క ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు తప్ప. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అత్యంత ఒత్తిడి ఉన్నా అతనేంటో ప్రతిసారీ నిరూపించుకున్నాడు' అని అని కేన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ... 'ఫుట్‌బాల్ అంటే ఇష్టం. మేం కలిసినప్పుడు అదే మాట్లాడుకున్నాం. వార్మప్ కోసం ప్రతి క్రికెట్ జట్టు ఫుట్‌బాల్ ఆడుతుంది. కానీ.. ఏ ఫుట్‌బాల్ జట్టూ క్రికెట్ మాత్రం ఆడదు. ఫుట్‌బాల్‌లో నా ఆట కన్నా.. క్రికెట్‌లో హ్యారీ మెరుగ్గా ఉన్నాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ తలపడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే చివరి లీగ్ మ్యాచుల ద్వారా సెమీఫైనల్లో తలపడే జట్లు తేలనున్నాయి.