ఇంగ్లండ్ జట్టుకు ఎదురు దెబ్బ! గాయపడ్డ ఆల్‌రౌండర్..మ్యాచ్‌లకు దూరం!

లండన్: ప్రపంచకప్ మెగా టోర్నమెంట్‌లో గాయపడ్డ క్రికెటర్ల జాబితాలో మరో పేరు జత చేరింది. ఆతిథ్యం జట్టు ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ గాయపడ్డాడు. తరువాతి రెండు మ్యాచ్‌లకు అతను దూరం అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లతో తన తదుపరి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లకూ జేసన్ రాయ్ దూరమయ్యాడు.
ఈ రెండు మ్యాచ్‌లల్లో ఆడట్లేదు. అతనికి బదులుగా జేమ్స్ విన్సీని ఆడించబోతోంది ఇంగ్లండ్ క్రికెట్ మేనేజ్‌మెంట్. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లల్లో జేమ్స్ విన్సీ.. బెయిర్‌స్టోతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా జేసన్ రాయ్ కాలి కండరాలు పట్టేశాయి. చీలమండలానికి అంతర్గతంగా గాయమైనట్లు తేలింది. ఇదే మ్యాచ్‌లో కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ కూడా గాయపడ్డాడు.
కొంతసేపు మైదానాన్ని వీడివెళ్లాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ నాటికి పూర్తిగా నయం అవుతుందని జట్టు ఫిజియోథెరఫిస్ట్ వెల్లడించాడు. రాయ్ మాత్రం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, అందువల్లే అతణ్ని ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లకు దూరంగా ఉంచామని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో టోర్నమెంట్‌లో భాగంగా.. ఇంగ్లండ్ మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications