
హైదరాబాద్: ప్రతిష్ట, కీర్తి గురించి ఆలోచించనని, జట్టు నా నుంచి ఏం కోరుకుంటుందో అదే చేస్తానని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అతి తక్కువ కాలంలో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా తెచ్చుకున్న బుమ్రా బుధవారం సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు చక్కటి ఆరంభాన్నిచ్చిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో తన వైవిధ్యమైన బౌలింగ్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఆరంభంలోనే ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చి గట్టి షాకిచ్చాడు. ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ తన విజయం వెనక ఎంతో శ్రమ దాగుందని చెప్పుకొచ్చాడు.
"చాలాసార్లు నేను అంచనాలను పట్టించుకోను. జట్టు నా నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకుంటా. ప్రతిష్ట, కీర్తి గురించి ఆలోచించను. పరిస్థితులను అదుపులో ఉంచుకుంటా. మ్యాచ్‌లో అసలేం జరుగుతుందో మొత్తం గమనిస్తాను" అని బుమ్రా తెలిపాడు.
"నేర్చుకోవడానికి, కొత్త అస్త్రాలను రూపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నేర్చుకోవడంలో తప్పులేదు. ఉదాహరణకు ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన బౌలింగ్ యాక్షన్ ఏదైనా ఉంటే చెప్పండి. దానిని అనుకరించేందుకు ప్రయత్నిస్తా" అని బుమ్రా పేర్కొన్నాడు.
"కెమెరా కంటికి కనిపించిన హార్డ్‌వర్క్ చేస్తాను. ప్రతి మ్యాచ్‌కు ముందే ప్రాక్సీస్‌లో ఎంతో శ్రమిస్తా. కొత్త బంతితో సరికొత్తగా జట్టుకు ఏమైనా చేయగనేమో ప్రయత్నిస్తా. వైవిధ్యం కోసం ప్రయోగాలు చేస్తా. సన్నాహకం ముగిసిన తర్వాత మ్యాచ్‌లో వాటిని కచ్చితత్వంతో అమలు చేయడంపైనే దృష్టి పెడతాను" అని బుమ్రా తెలిపాడు.