
చదువుకున్న వాళ్లు ఇలా మాట్లాడతారా:
తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై అఫ్రిదీ స్పందించాడు. 'చదువుకున్న వాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా?. గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు పూర్తి పరిణతితో ఉన్నాడా?. తెలివిగలవారు ఎవరైనా ఇలా వ్యాఖ్యలు చేస్తారా?. గంభీర్ ఒక బేవకూఫ్ (ఇడియట్)' అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు.

బహిష్కరించాలని చెప్పడం సరికాదు:
'పుల్వామా ఉగ్రదాడి ఆమోద యోగ్యం కాదని, అయినా దానికి ముడిపెడుతూ ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని చెప్పడం ఏంటని' ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇకపై ఆసియా కప్‌లోనూ రెండు జట్లు తలపడకపోవడం మంచిదేమోనని' అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది

పొగరు తప్ప ఏమీలేదు:
అఫ్రిది తన ఆత్మకథ 'గేమ్ చేంజర్'లో కూడా గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేసాడు. గంభీర్‌కు పొగరు తప్ప చెప్పుకోదగ్గ రికార్డులు ఏమీ లేవని రాసుకొచ్చాడు. తన మత విశ్వాసాల కారణంగా తన కూతుళ్లను ఔట్‌డోర్ గేమ్స్ ఆడనివ్వనని కూడా ఆ పుస్తకం ద్వారా తెలిపాడు. వీటోతో పాటు తన వయస్సుకు సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అఫ్రిది తన ఆత్మకథలో రాసాడు.

పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలి:
పుల్వామా ఉగ్రదాడి సమయంలో గౌతమ్‌గంభీర్ మాట్లాడుతూ... 'పాక్‌తో అన్ని క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవాలి. ఇలాంటి ఘటన నేపథ్యంలో వారితో క్రికెట్ ఆడలేం. 40 మంది అమరుల ప్రాణాల కన్నా.. రెండు పాయింట్లు ఏమాత్రం ఎక్కువ కాదు. ఒకవేళ ఫైనల్‌లో తలపడాల్సి వచ్చినా ఆటను రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ విషయంపై దేశం మొత్తం ఒకేమాటపై నిలబడాలి' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
