సెమీస్ నుంచి పాక్ నిష్క్రమణ ఖాయమే!: ఆ ఓటమే బాధించిందన్న ఓపెనర్

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమి తనను ఎంతగానో కలచి వేసిందని పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ ఆవేదన చెందాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయినా... ఇమాముల్ హక్ నిలకడగా ఆడి జట్టుని గెలిపించేంత పని చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్‌లో అడుగు పెట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు మరోసారి సువర్ణావకాశాన్ని కల్పించింది. రన్‌రేట్‌లో పాకిస్తాన్ కంటే- న్యూజిలాండ్ చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ.. దానిని అందుకోవడం కష్టసాధ్యమే.

తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాతో తలపడనున్న పాక్
పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. శుక్రవారం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగబోతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోయే ఈ మ్యాచ్.. పాకిస్తాన్‌కు చావోరేవోగానే పరిగణించుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. భారీ నుంచి అతి భారీ స్కోరును చేయాల్సి ఉంటుంది.

312 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించాలి
అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన బంగ్లాదేశ్‌ను అతి తక్కువ పరుగులకు కట్టడి చేయాలి. తక్కువలో తక్కువగా 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి ఉంటుంది పాకిస్తాన్. అది సాధ్యపడితే- పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది. ఒక వన్డే మ్యాచ్‌లో 312 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యంగానే భావించుకోవచ్చు.

సెమీఫైనల్‌కు ప్రవేశించే అవకాశాలు
సెమీఫైనల్‌కు ప్రవేశించే అవకాశాలు న్యూజిలాండ్‌కు పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించడం అసాధ్యమైనందున.. బ్లాక్ క్యాప్స్ నిశ్చింతంగా ఉండొచ్చు. దీనిపై ఇమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ గ్లాండ్ తన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు గెలవడం ద్వారా తమ నాకౌట్ అవకాశాలు మూసుకు పోయాయని చెప్పాడు.

పాక్ సెమీస్‌కు చేరకపోవడంపై
పాక్ సెమీస్‌కు చేరకపోవడంపై తమ ఆటగాళ్లు నిరాశ చెందలేదని, బంగ్లాదేశ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో పోరాడతామని ఇమాముల్ అన్నాడు. ఇక, తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయానని బాధపడ్డాడు. తాను యువ ఆటగాడినేనని, ఈ ప్రపంచకప్‌లో అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు.

ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్ 205 పరుగులు
ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్ హాఫ్ సెంచరీతో 205 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడినా.. సెమీఫైనల్ చేరడం దాదాపుగా లాంఛనమే. పాకిస్థాన్ నిష్క్రమణ కూడా ఖాయమే. కాగా, తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే విజయం నమోదు చేసిన పాకిస్థాన్ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications