Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం బ్యాటింగ్‌రా బాబూ!: ధోని-జాదవ్‌పై సోషల్ మీడియాలో జోకులు

ICC Cricket World Cup 2019 : MS Dhoni Trolled By Fans For Slow Innings ! || Oneindia Telugu
ICC Cricket world Cup 2019: Despite Second Highest Strike-Rate, Fans Troll MS Dhoni For Slow Innings

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి ధోని-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకునే లక్ష్యం అయినప్పటికీ వీరిద్దరూ పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఆడిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆఖరి ఓవర్లలో భారీ షాట్లకు పోకుండా కేవలం సింగిల్స్‌ తీస్తూ మ్యాచ్‌ని చేజార్చారని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ధోని-జాదవ్‌ స్లో బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. చేతిలో ఐదు వికెట్ల ఉండి కూడా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ నాసిర్ హుస్సేన్ అయితే ధోని-జాదవ్‌ల బ్యాటింగ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి 10 ఓవర్లు, చివరి 6 ఓవర్లలో పరుగులు చేయడంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ధోని బ్యాటింగ్ 1999 నాటి ఇన్నింగ్స్‌ని తలపిస్తుందని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

మరొక నెటిజన్ అయితే ఐపీఎల్ 2019లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయానికి 24 బంతుల్లో 64 పరుగులు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడటంతో చివరకు సీఎస్‌కే ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. అదే 5 ఓవర్లకు 71 పరుగులు అవసరమైన దశలో ధోని బ్యాటింగ్ చెత్తగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ధోని (31 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (13 బంతుల్లో 12 నాటౌట్‌)లు చివరి 31 బంతుల్లో 39 పరుగులే చేసి నిరాశపరిచారు. 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. దీంతో 31 పరుగల తేడాతో కోహ్లీసేన ఓటమిపాలైంది.

Story first published: Monday, July 1, 2019, 13:48 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+