For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని కోసం వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ గెలుస్తుంది!!

ICC Cricket World Cup 2019: Darren Sammy makes bizarre prediction, picks 8th ranked team as winner

వెస్టిండీస్‌ స్టార్ ఓపెనర్, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కోసం వెస్టిండీస్‌ ఈసారి కచ్చితంగా ప్రపంచకప్‌ గెలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ ప్రివ్యూ షోలో డారెన్‌ సామీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'వెస్టిండీస్‌ కచ్చితంగా ప్రపంచకప్‌ గెలుస్తుంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇదే అతనికి చివరి ప్రపంచకప్‌. కప్ సాధించి అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలనుకుంటున్నాం. అతని కోసమైనా వెస్టిండీస్‌ కప్‌ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది' అని సామీ అన్నారు.

'విండీస్ 1979లో కప్ గెలిచింది. ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. నేను బైబిల్‌ పఠించే వ్యక్తిని. బైబిల్‌లో 40వ నంబర్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సారి మాకు టైం వచ్చింది. వెస్టిండీస్‌ మళ్లీ ప్రపంచకప్‌ గెలుస్తుంది. మా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఇంగ్లండ్‌ పిచ్‌లకు అనుగుణంగా జట్టులో బౌలర్లు ఉన్నారు' అని సామీ పేర్కొన్నారు.

వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ జట్టు:
జేసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, డారెన్‌ బ్రావో, ఆండ్రి రసెల్‌, షై హోప్‌, హెట్‌మయర్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆష్లే నర్స్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, ఒషానె థామస్‌, గాబ్రియల్‌, షెల్డన్‌ కాట్రెల్‌.

Story first published: Saturday, May 18, 2019, 19:32 [IST]
Other articles published on May 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+