322 పరుగులు భారీ లక్ష్యాన్ని
అనంతరం వెస్టిండిస్ నిర్దేశించిన 322 పరుగులు భారీ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి, ఇంకా 51 బంతులు ఉండగానే చేధించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షెల్డన్ కాట్రెల్ సంధించిన 18వ ఓవర్ రెండో బంతికి తమీమ్ ఇక్బాల్(48) ఊహించని రీతిలో రనౌటై పెవిలియన్‌కు చేరాడు.
Tamim Iqbal drives it down the pitch, Cottrell stops it and sends a bullet throw through Tamim and he's caught short!
Live blog: https://t.co/pKtbAYdBzO pic.twitter.com/AgPr0PCyIu — The Field (@thefield_in) June 17, 2019 '>
కాట్రెల్ వేసిన మూడో బంతిని
ఆ ఓవర్ తొలి బంతికి తమీమ్ పరుగు తీయగా, రెండో బంతికి షకీబుల్ హసన్ పరుగు సాధించాడు. కాట్రెల్ వేసిన మూడో బంతిని తమీమ్ ఇక్బాల్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... ఆ బంతి నేరుగా కాట్రెల్ చేతికే చిక్కింది. దీంతో వెంటనే అతడు బంతిని నేరుగా వికెట్లు పైకి విసరగా... వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో తమీమ్ ఇక్బాల్ కిందపడ్డాడు. అయితే, ఎంత వేగంగా అంటే, బంతిని అందుకోవడం అంతే కచ్చితత్వంతో వికెట్లను నేలకూల్చాడు.

హాఫ్ సెంచరీ ముంగిట తమీమ్ ఇక్బాల్ ఔట్
దీంతో హాఫ్ సెంచరీ ముంగిట తమీమ్ ఇక్బాల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. బంతి గురి తప్పకుండా, బ్యాట్స్‌మన్‌కు తగలకుండా విసరడం వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఇది ఈ వరల్డ్‌కప్ బెస్ట్ మూమెంట్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షెల్డన్ కాట్రెల్ విసిరిన డైరెక్ట్ త్రోపై నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు
బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (48), సౌమ్య సర్కార్ (29) తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 52 పరుగులు జోడించారు. ఒకానొక ఓ దశలో 121/1తో ఉన్న బంగ్లాదేశ్ ఆ తర్వాత స్వల్ప పరుగుల తేడాతో తమీమ్, ముష్ఫికర్ (1) వికెట్లు కోల్పోయి 133/3కు చేరుకుంది. ఈ క్రమంలో వెస్టిండిస్ బౌలర్లు రాణించి మ్యాచ్‌ని తమవశం చేసుకుంటారని అంతా భావించారు.

వరుసగా మూడు కళ్లు చెదిరే సిక్సర్లు
అయితే, జోరుమీదున్న షకిబ్ ఉల్ హాసన్‌కు లిటన్ దాస్ తోడవడంతో బంగ్లా స్కోరు బోర్డులో వేగం పెరిగింది. విండిస్ బౌలర్ థామస్ బౌలింగ్‌లో ఓ కవర్ డ్రైవ్‌తో షకిబ్(83 బంతుల్లో) సెంచరీ సాధించగా.. గాబ్రియెల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ వరుసగా మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. వీరిద్దరి జోడి నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి బంగ్లాకు విజయాన్నందించారు.


Click it and Unblock the Notifications
