Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోడీ 'కాషాయ' రాజకీయం: కోహ్లీసేన ఆరెంజ్ జెర్సీపై కాంగ్రెస్, ఎస్పీ అభ్యంతరం

ICC Cricket World Cup 2019: Congress, SP legislators oppose orange jerseys for Indian cricket team

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత క్రికెట్ జట్టు ఆరెంజ్ కలర్ జెర్సీని ధరించడాన్ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 30న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీతో బరిలోకి దిగనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ముస్లిం ఎమ్మెల్యేలు టీమిండియా ఆరెంజ్ కలర్ జెర్సీలను ధరించడంపై మండిపడుతున్నారు. అలాగే, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబు అసిమ్ అజ్మి మాట్లాడుతూ టీమిండియా ఆరెంజ్ కలర్ జెర్సీని ధరించడం వెనుక ప్రభుత్వ నిర్ణయం ఉందని తెలిపారు.

ఆరెంజ్ కలర్‌ను ఎందుకు ఎంచుకున్నారు?

ఆరెంజ్ కలర్‌ను ఎందుకు ఎంచుకున్నారు?

"మోడీ జీ ఈ దేశాన్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారు. త్రివర్ణ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి కదా. వాటిని కాదని ఆరెంజ్ కలర్‌ను ఎందుకు ఎంచుకున్నారు? దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్లు జాతీయ జెండాలో ఉన్న మూడు రంగుల్లో ఏదో ఒకటి అయితే బాగుంటుంది" అని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే నషీమ్ ఖాన్ మాట్లాడుతూ

కాంగ్రెస్ ఎమ్మెల్యే నషీమ్ ఖాన్ మాట్లాడుతూ

మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నషీమ్ ఖాన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కాషాయ రంగు రాజకీయాలను చేస్తోందని అన్నారు. "మోడ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాషాయ రంగు రాజకీయాలు చేస్తోంది. త్రివర్ణ పతాకాన్ని గౌరవించడంతో పాటు జాతీయ సామరస్యాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం మాత్రం అంతటా కాషాయాన్ని ప్రోత్సహిస్తోంది" అని విమర్శించారు.

అసలేం జరిగింది?

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్‌ల వివరాల్ని అందజేయాలి. రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న ఇంగ్లాండ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక దేశాల జెర్సీలు కూడా టీమిండియా ధరించే నీలి రంగు జెర్సీలను పోలి ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆరెంజ్ కలర్ జెర్సీతో

ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల్లో కోహ్లీసేన నారింజ రంగు జెర్సీల్లో దిగనుంది. కాగా, ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం. లంక కూడా ఈ వరల్డ్‌కప్‌లో బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతోంది.

Story first published: Wednesday, June 26, 2019, 18:13 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+