న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌.. ఎంతమంది కెప్టెన్‌లు సెంచరీ చేశారంటే!!

ICC Cricket World Cup 2019 : Captains Who Scored Centuries In World Cup Finals || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Clive Lloyd & Ricky Ponting Two captains who scored centuries in World Cup final

ప్రపంచకప్‌-2019 మెగా సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే 1975లో లార్డ్స్‌ మైదానం వేదికగా తొలి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగగా.. వెస్టిండీస్‌ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలవగా.. భారత్, వెస్టిండీస్‌ రెండు సార్లు గెలుచుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ చెరోసారి ట్రోఫీని ముద్దాడాయి.

ఇద్దరు మాత్రమే ప్రత్యేకం:

ఇద్దరు మాత్రమే ప్రత్యేకం:

ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో చాలా మందే సెంచరీలు చేశారు. అయితే ఓ ఇద్దరు మాత్రమే ప్రత్యేకంగా నిలిచారు. వారే విండీస్ కెప్టెన్ క్లెయివ్ లాయిడ్, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్. ఈ ఇద్దరు కెప్టెన్‌లుగా ఉండి.. ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీలు చేయడంతో అందరిలోకెల్లా ప్రత్యేకంగా నిలిచారు. ఈ ఇద్దరు తమ సారథ్యంలో వరుసగా రెండు సార్లు ట్రోఫీ అందించారు.

85 బంతుల్లో 102:

85 బంతుల్లో 102:

అది 1975 ప్రపంచకప్‌. లార్డ్స్‌ మైదానం వేదికగా తొలి ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌. ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ చాపెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ 50 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ క్లెయివ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు చేసాడు. క్లెయివ్ లాయిడ్ జోరుతో విండీస్ 291 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో విండీస్ తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

121 బంతుల్లో 140:

121 బంతుల్లో 140:

అది 2003 ప్రపంచకప్‌. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ గంగూలీ.. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉన్న పిచ్‌పై ముందు బౌలింగ్‌ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు రెచ్చిపోయి ఆడాడు. 105 పరుగుల వద్ద మొదటి వికెట్ పడగా.. ఆసీస్ కెప్టెన్ పాయింటింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 121 బంతుల్లో 140 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పాంటింగ్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. దీంతో ఆసీస్ 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత్ 125 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Monday, May 27, 2019, 13:37 [IST]
Other articles published on May 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X