For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 6 పరుగులు చేస్తే.. ఆ రికార్డు క్రిస్‌ గేల్‌దే!!

ICC Cricket World Cup 2019: Chris Gayle needs 6 more runs for becoming the 3rd Windies player to score 1000 runs in World Cup

ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌ హామ్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసక ఓపెనర్ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా గేల్ రికార్డు నెలకొల్పాడు.

1
43645

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరు పరుగులు చేస్తే:

ఆరు పరుగులు చేస్తే:

క్రిస్ గేల్ వెస్టిండిస్ తరఫున మరో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో మరో ఆరు పరుగులు చేస్తే.. వెస్టిండిస్ తరఫున మెగా టోర్నీలో వెయ్యికి పైగా పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా క్రిస్ గేల్ నిలువనున్నాడు. విండీస్ మాజీ దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా, వివ్ రిచర్డ్స్ తర్వాత ఈ అరుదైన ఫీట్ అందుకోనున్న మూడో క్రికెటర్ గేల్.

52వ అర్ధ శతకం:

52వ అర్ధ శతకం:

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 33 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లతో క్రిస్ గేల్ మెరుపు అర్ధ శతకం చేసాడు. వన్డే కెరీర్‌లో గేల్‌కు 52వ అర్ధ శతకం. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు గేల్ 1000 పరుగులు పూర్తి చేయడానికి 56 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం చేసి అవుట్ అయ్యాడు. దీంతో మరో సరికొత్త రికార్డుకు ఆరు పరుగుల దూరంలో నిలిచాడు.

వెస్టిండీస్‌ విజయం:

వెస్టిండీస్‌ విజయం:

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ పేస్‌ బౌలర్లు ఒషేన్‌ థామస్‌ (4/27), జేసన్‌ హోల్డర్‌ (3/42), రసెల్‌ (2/4)ల ధాటికి విలవిల్లాడిన పాకిస్థాన్‌.. 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫకర్‌ జమాన్‌ (22), బాబర్‌ అజామ్‌ (22) టాప్‌ స్కోరర్లు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. గేల్‌ (50; 34 బంతుల్లో 6×4, 3×6) మెరుపు అర్ధ శతకం చేసాడు. నికోలస్‌ పూరన్‌ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Story first published: Saturday, June 1, 2019, 7:48 [IST]
Other articles published on Jun 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+