'ఆస్ట్రేలియా జట్టులో బ్యాట్స్‌మన్ కన్నా బౌలర్లే కీలకం'

ప్రపంచకప్‌లో మా బౌలర్లే కీలక పాత్ర పోషిస్తారు. ఇంగ్లాండ్ గడ్డపై ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నారు. మే 30 నుండి ఇంగ్లండ్ వేదికగా ఆరంభమయ్యే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతోంది. ఫేవరేట్ జట్లలో ఆసీస్ కూడా ఉంది. ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌ను జూన్ 1న ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో ఆడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బౌలర్లదే కీలక పాత్ర:
జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... 'వన్డేల్లో ప్రతి ఒక్కరూ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మా బౌలింగ్ వన్డే, టీ20లలో బలంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో మా జట్టు బాగా ఆడుతుంది. ప్రపంచకప్‌లో మా బౌలర్లదే కీలక పాత్ర. ఇంగ్లాండ్‌లోని ఫ్లాట్ పిచ్‌లపై, పెద్ద మైదానాల్లో, ఔట్‌ఫీల్డ్ వేగంగా ఉండే పిచ్‌లపై మాకు అనుభవం ఉంది. అక్కడి పిచ్‌లపై బౌలర్లు పూర్తి సామర్థ్యంతో బంతులేయాలి. మా బౌలర్లు ఈ సవాల్‌ను స్వీకరించేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారు' అని లాంగర్ తెలిపారు.

ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం:
'పాకిస్థాన్‌తో సిరీస్‌లో మా జట్టు రాణించింది. ఆ తర్వాత ఎక్కువ క్రికెట్ ఆడలేదు. ప్రపంచకప్‌కు ముందు 3 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉన్నాయి. సెంటర్ పిచ్‌పై ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ కీలకం. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చూసాను. అతను ఓ మ్యాచ్ విన్నర్. అతను తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతనిలో మునుపటి ఎనర్జీ అలాగే ఉంది. కచ్చితంగా స్మిత్ రాణిస్తాడు' అని లాంగర్ ఆశాభావం వ్యక్తం చేసారు.

హేజిల్‌వుడ్ లేకపోవడం పెద్ద లోటు:
'ప్రపంచకప్ జట్టులో హేజిల్‌వుడ్ లేకపోవడం పెద్ద లోటు. అతను కొన్ని నెలలుగా ఎక్కువ వన్డే క్రికెట్ ఆడలేదు. వెన్నుకు అయిన గాయంతో ఐప్పుడే కోలుకుంటున్నాడు. అతను గొప్ప బౌలర్. గత నాలుగేళ్లుగా అతని గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కానీ అతనికి ఇప్పుడు కలిసి రాలేదు. జట్టులో స్థానం దక్కనందుకు హేజిల్‌వుడ్‌తో పాటు చాలామంది ఆటగాళ్లు నిరాశగా ఉన్నారు. త్వరలోనే మళ్లీ ఆసీస్ జట్టులో స్థానం సంపాదిస్తాడు' అని లాంగర్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications