న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌తో బంగ్లా ఢీ: షకీబ్ అరుదైన ఘనత

ICC Cricket World Cup 2019, Bangladesh vs New Zealand Match Prediction: Who will win World Cup 2019 match today preview


ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా లాంటి పటిష్ట జట్టును ఓడించిన బంగ్లాదేశ్‌ మరో విజయంపై కన్నేసింది. ఇక తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్‌ కూడా మరో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఓవల్ మైదానం వేదికగా బుధవారం సాయంత్రం బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఉత్సాహంతో బంగ్లా:

ఉత్సాహంతో బంగ్లా:

బంగ్లా తాజాగా భారత్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓడినా.. తొలి మ్యాచ్‌లో సఫారీలను మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ విఫలమయినా.. ముష్పికర్ రహీం, సౌమ్యా సర్కార్, మహ్మదుల్లా, ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌లు రాణించారు. మిథున్, షబ్బీర్ రెహమాన్లతో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. ముస్తఫిజుర్ రెహమాన్, సైఫుద్దీన్ లు పేస్ విభాగంలో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. మోర్తజా, షకిబ్‌లు బౌలింగ్ భారం మోయనున్నారు. పటిష్టంగా ఉన్న బంగ్లా రెండో మ్యాచ్‌లో నెగ్గాలని చూస్తోంది.

పటిష్ట బ్యాటింగ్:

పటిష్ట బ్యాటింగ్:

ప్రస్తుతం కివీస్‌ అసాధారణ ఫామ్‌లో ఉంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంతో ఉంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 136 పరుగులకే పరిమితం చేసిన కివీస్ బౌలర్లు దూకుడుమీదున్నారు. పేసర్లు హెన్రీ, బౌల్ట్, ఫెర్గుసన్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. లక్ష్యాన్ని ఓపెనర్ బ్యాట్స్‌మన్‌లే ఛేదించారు. గుప్తిల్, మున్రోలు అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు విలియం సన్, టేలర్, లాతమ్, నీషంలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాకు ఇది క్లిష్టమైన మ్యాచే.

గత రికార్డులు:

గత రికార్డులు:

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ 4 మ్యాచ్‌లు ఆడగా.. అన్నింట్లో కివీసే గెలిచింది. మొత్తంగా బంగ్లా, కివీస్‌లు 35 వన్డేలు ఆడాయి. న్యూజిలాండ్‌ 24 గెలవగా.. బంగ్లా 10 గెలిచింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. చివరి 3 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది. సాయంత్రం 6 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.

షకీబ్‌ @ 200:

షకీబ్‌ @ 200:

షకిబ్‌ అల్‌ హసన్‌కు ఇది 200వ వన్డే. బంగ్లాదేశ్‌ తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్‌ గుర్తింపు పొడనున్నాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా (208 మ్యాచ్‌లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (206 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గత మ్యాచ్‌లో సత్తా చాటిన షకిబ్‌.. ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని బంగ్లా కోరుకుంటోంది.

Story first published: Wednesday, June 5, 2019, 13:54 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X