బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్?

ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం భారత్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. గాయపడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రానున్నాడని సమాచారం తెలుస్తోంది. ఓపెనర్‌గా వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ బదులుగా మయాంక్ ఓపెనింగ్ చేయనున్నాడు. మయాంక్ ఓపెనింగ్ చేస్తే.. రాహుల్ లేదా పంత్ నాలుగో స్థానంలో ఆడనున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టెస్ట్ మ్యాచ్‌లో ఆరంగేట్రం:
గత డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ భారత్ తరుపున ఆరంగేట్రం చేసాడు. ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో 295 టెస్టు క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో అర్థ తకం (76పరుగులు) చేసిన మయాంక్.. సెకండ్ ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసాడు. ఒకవేళ మయాంక్ ఆడితే ఇదే అతనికి తొలి ప్రపంచ కప్ మ్యాచ్ అవనుంది.

భువనేశ్వర్ కూడా:
మరోవైపు ఈ మ్యాచ్‌లో గాయపడిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఆడున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన భువనేశ్వర్ తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడలేదు. అతడిస్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ.. మూడు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. అయితే ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో భువీ కూడా జట్టులోకి రానున్నాడు. చహల్, జాదవ్ స్థానాల్లో భువీ, జడేజా రానున్నారు.

తప్పులపై దృష్టి:
బంగ్లాతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'బంగ్లాతో మ్యాచ్‌కు భువీ సిద్ధంగా ఉన్నాడు. ఆతిథ్య జట్టుతో ఓటమి అనంతరం టీమిండియా చేసిన తప్పులపై దృష్టి పెట్టింది. వాటిని సరిచేసుకొని ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుంది' అని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications