For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. షకీబ్‌తో జాగ్రత్త

ICC Cricket World Cup 2019, Bangladesh vs India: Shakib Al Hasan treat to India & Shakib warns India after record-breaking performance against Afghanistan

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లపై విజయాలు సాధించింది. ఇక న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షార్పణమైంది. పటిష్ట జట్లను ఓడించిన భారత్‌.. పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓటమి అంచుల దాకా వెళ్లి షమీ పుణ్యమా అని బయటపడింది. ప్రస్తుతం 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 రెండు విజయాలు:

రెండు విజయాలు:

భారత్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈనెల 27న వెస్టిండీస్‌ (మాంచెస్టర్‌), 30న ఇంగ్లాండ్‌ (బర్మింగ్‌హామ్‌), జులైన 2న బంగ్లాదేశ్‌ (బర్మింగ్‌హామ్‌), 6న శ్రీలంక (లీడ్స్‌)లతో తలపడనుంది. వీటిలో రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు భారత్‌ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. వెస్టిండీస్‌, శ్రీలంకలపై విజయం సులువే. ఇక ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మ్యాచ్ కోల్పోయే ప్రమాదం ఉంది.

అద్భుత ఫామ్‌లో:

అద్భుత ఫామ్‌లో:

ఇంకా ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 2007 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించి ఇంటిదారి పట్టించింది బంగ్లా. రెండోది ప్రస్తుత జట్టులో ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ అద్భుత ఫామ్‌లో ఉండడం. మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్ ముందు వరకు షకిబ్‌ టోర్నీలో టాప్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ (500), ఫించ్‌ (496) చెలరేగడంతో మూడో స్థానంలోకి వెళ్ళాడు. షకిబ్‌ (476) ఇప్పటికే రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసాడు.

షకీబ్‌తో జాగ్రత్త:

షకీబ్‌తో జాగ్రత్త:

బ్యాటింగ్‌, బౌలింగ్ రెండిట్లో షకిబ్‌ రాణిస్తున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బంతితోనూ మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా షకీబ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. భారత బౌలర్లు షకిబ్‌ను త్వరగా పెవిలియన్ చేర్చితే బంగ్లా పనిపట్టొచ్చు. 'భారత్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. బలమైన టీమిండియాను ఓడిస్తాం' అని షకీబ్‌ అన్నాడు.

Story first published: Wednesday, June 26, 2019, 12:55 [IST]
Other articles published on Jun 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+