రోహిత్ గొప్ప వన్డే బ్యాట్స్‌మన్.. బుమ్రా బౌలింగ్ ఎప్పుడూ కఠినమే

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గొప్ప వన్డే బ్యాట్స్‌మన్. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎప్పుడూ కఠినమే అని విరాట్ కోహ్లీ అన్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సెమీఫైనల్స్‌లో కొనసాగిస్తాం:
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'టోర్నీలో బంగ్లాదేశ్ మంచి క్రికెట్ ఆడింది. ఈ మ్యాచ్‌లో చివరి వికెట్ వరకు పోరాడారు. వారు చివరి వరకు రేసులోనే ఉన్నారు. వారి పోరాటం అద్భుతం. విజయం కోసం మేము చాలా కష్టపడాల్సి వచ్చింది, కాని ఇప్పుడు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహాన్ని సెమీఫైనల్స్‌లో కొనసాగిస్తాం' అని కోహ్లీ అన్నారు.

అతను అదనపు బలం:
'మాకు ఇంకో మ్యాచ్ ఉంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన ఆట కంటే.. మెరుగ్గా ఆడుతాం. కీలక సమయంలో హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేసాడు. వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. అతను బౌలింగ్ చేసేటప్పుడు ఒక బ్యాట్స్‌మన్‌గా అలోచించి బౌలింగ్ చేస్తాడు, ఇదే అతనికి వికెట్లు వచ్చేలా దోహదం చేస్తోంది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించాడు. పాండ్యా జట్టులో ఉండడం అదనపు బలం' అని కోహ్లీ పేర్కొన్నారు.

అందుకే కాంబినేషన్‌ను మార్చాం:
'ఐదుగురు బౌలర్లతో ఆడటం సవాలు. కాని గ్రౌండ్ చిన్నదిగా ఉన్నందున కాంబినేషన్‌ను మార్చాల్సి వచ్చింది. చిన్నమైదానాల్లో ఆడుతున్నప్పుడు ఖచ్చితమైన కాంబినేషన్‌ను ప్రయత్నించాలని అనుకున్నాము.. ఎందుకంటే ప్రతి పిచ్, ప్రతి ఆటలో ఒకే కలయికతో ఆడలేము. అందుకే కాంబినేషన్‌ను మార్చాం, ఈ రోజు ఫలితం వచ్చింది' అని కోహ్లీ తెలిపారు.

గొప్ప వన్డే బ్యాట్స్ మెన్:
'కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ ఆటను చూస్తున్నాను. ప్రపంచంలోనే రోహిత్ గొప్ప వన్డే బ్యాట్స్ మెన్. రోహిత్ ఇలా ఆడితేనే అందరూ ఆస్వాదిస్తారు. బుమ్రా బౌలింగ్ ఎప్పుడూ కఠినమే. అందుకే అతని ఓవర్లను మేం కాపాడుకుంటాం. అతను ప్రపంచశ్రేణి బౌలర్. ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలో అతనికి బాగా తెలుసు. జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా. లంక కూడా మంచి జట్టు. ఇదే ఆటను కొనసాగిస్తాం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications