భారత్ Vs బంగ్లాదేశ్: గెలిచి నిలిచేనా?, హెడ్ టు హెడ్ రికార్డులివే!

హైదరాబాద్: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నిలకడగా రాణిస్తోన్న జట్లలో టీమిండియా ఒకటి. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌ని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు బంగ్లా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.
టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. దీంతో 11 పాయింట్లతో పట్టికలో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతుండగా... బంగ్లాదేశ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 3 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దు అయింది.
ప్రస్తుతం 7 పాయింట్లతో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టోర్నీలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మొత్తం 35 వన్డేలు జరగ్గా ఇండియా 29 వన్డేల్లో విజయం సాధించగా... 5 వన్డేల్లో ఓడిపోయింది.
ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక, ప్రపంచకప్ విషయానికి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా రెండింట విజయం సాధించగా.. బంగ్లా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో తనదైన రోజున బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శన చేయగలదు. బంగ్లా తరుపున షకీబ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

మ్యాచ్ డిటేల్స్
తేదీ: మంగళవారం, 2nd July 2019
సమయం: 03:00 PM IST
వేదిక: ఎడ్జిబాస్టన్, బర్మింగ్ హామ్
లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్
ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

వేదికలో నమోదైన గణాంకాలు
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి: 229
రెండో ఇన్నింగ్స్ యావరేజి: 183
అత్యధిక స్కోరు: 408/9 (50 Ov) by ENG vs NZ
అతి తక్కువ స్కోరు: 70/10 (25.2 Ov) by AUS vs ENG

ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్
Total: 03
Bangladesh: 01
India: 02

కీలక ఆటగాళ్లు
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, షకీబ్ ఉల్ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఇండియా: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా

జట్ల వివరాలు
బంగ్లాదేశ్: మష్రఫె మొర్తాజా(కెప్టెన్), సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకీబ్ ఉల్ హాసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసద్దీక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, షమీ, బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications