Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాతో తలపడటం అంత తేలిక కాదు.. మాకు సరైన ప్రణాళికలు ఉన్నాయి

ICC Cricket World Cup 2019 : India V Bangladesh : Mortaza Says 'Need To Play Better Than Before'
ICC Cricket World Cup 2019, Bangladesh vs India: Mashrafe Mortaza says Tigers will stick to their plans and wont try to emulate England

టీమిండియా బలమైన జట్టు. టీమిండియాతో తలపడటం అంత తేలిక కాదు. అయితే గెలవడానికి మాకు సరైన ప్రణాళికలు ఉన్నాయి అని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మోర్తాజా అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో మంగళవారం భారత్‌, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా.. ప్రస్తుతం ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నాకౌట్‌కు చేరాలంటే మిగిలిన ఈ రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. మరోవైపు న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఓడిలి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ రోజు టీమిండియాతో కీలక మ్యాచ్ సందర్భంగా మోర్తాజా మాట్లాడుతూ... 'ఈ ప్రపంచకప్‌లో టీమిండియా చాలా బలమైన జట్టు. ఆ జట్టుతో తలపడటం అంత తేలిక కాదు. అయినా విజయం సాధించడానికి వందశాతం ప్రయత్నిస్తాం. మేం సెమీస్ చేరుతామో లేదో అనే విషయం పక్కన పెడితే.. ఇప్పటివరకూ ఆడిన క్రికెట్‌ కన్నా ఈ మ్యాచ్‌లో ఇంకా మెరుగ్గా ఆడాలి' అని మోర్తాజా పేర్కొన్నారు.

'టీమిండియాపై గెలుపొందడానికి సరైన ప్రణాళికలు ఉన్నాయి. మ్యాచ్ సందర్భంగా వాటిని అమలు చేస్తే విజయం సాధించవచ్చు. కుల్‌దీప్‌, చాహల్‌ బాగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్‌ చేతిలో ఓడినంత మాత్రాన భారత్‌ను ఓడిస్తామనే ఆలోచన లేదు. ప్రపంచశ్రేణి ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు మరోసారి చెలరేగాలను కోరుకుంటున్నా. బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ లోపాలు కూడా సరిదిద్దుకుని ముందుకు సాగుతాం' అని మోర్తాజా తెలిపారు.

Story first published: Tuesday, July 2, 2019, 10:18 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+